
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చూసేందుకు అడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే ఈ జానర్ చిత్రాలు ప్రేక్షకులను ఆద్యంతం కట్టిపడేస్తుంటాయి. ప్రతి క్షణం ఊహించని మలుపులు తిరుగుతూ ఆ తర్వాత ఏం జరుగుతుందనే సస్పెన్స్ క్రియేట్ చేస్తుంటాయి. ఈమధ్యకాలంలో బాక్సాఫీస్ వద్ద సస్పెన్స్ థ్రిల్లర్ భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. అంతేకాదు.. స్టార్ నటీనటులు సైతం ఈ జానర్ చిత్రాల్లో నటించేందుకు ముందుకు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతున్న ఓ సీరియల్ కథ గురించి తెలుసుకుందాం. నగరంలో వరుస హత్యలు చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతున్న ఓ సీరియల్ కిల్లర్.. అతడి పట్టుకోవడానికి లేడీ పోలీస్ ఆఫీసర్ ఎలాంటి ప్రయత్నాలు చేసింది అనే స్టోరీ ఉన్న సినిమా ఇది. కేవలం ఐదు నిమిషాల్లోనే తీవ్రమైన ఉత్కంఠ ప్రారంభమై ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది.
ఈ క్రైమ్ సస్పెన్స్ మూవీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఇంతకీ ఈ సినిమా పేరెంటో తెలుసా.. ? అదే ది కేస్ ఆఫ్ కొండన (Case Of Kondana). మలయాళీ డైరెక్టర్ దేవి ప్రసాద్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ రాఘవేంద్ర, హీరోయిన్ భావన, కుషీ రవి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రం ఆద్యంతం భయానకంగా ఉన్నప్పటికీ.. ప్రతి క్షణం ప్రేక్షకులను చివరి వరకు చూడాలనే క్యూరియాసిటీని కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న భావన.. ఇప్పుడు మలయాళంలో వరుస చిత్రాలతో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే.
కథ విషయానికి వస్తే.. ఒక సైకో హంతకుడు వరుస హత్యలు చేస్తూ తప్పించుకుని తిరుగుతుంటాడు. నగరంలో జరిగే హత్యలపై పోలీసులు సమగ్ర దర్యాప్తు ప్రారంభిస్తారు. ఇందులో ఏసీపీ లక్ష్మి పాత్రలో భావన నటించింది. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు ప్రారంభించిన భావన.. ఆ సీరియల్ కిల్లర్ ను పట్టుకోవాలని ట్రై చేస్తుంది. అతడు ప్రతిసారి పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. అదే సమయంలో పోలీసులకు కొన్ని ఆధారాలు దొరుకుతాయి. దీంతో అవి దర్యాప్తు దిశను మారుస్తాయి. సినిమా ప్రారంభమైన 5 నిమిషాల్లోనే ప్రారంభమైన ఉత్కంఠ.. క్లైమాక్స్ వరకు సాగుతుంది.
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..