
చాలా మంది ముద్దుగుమ్మలు సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈ మధ్య కాలంలో సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలు చాలా వరకు తక్కువ ఉంటున్నాయి. దాంతో సినిమాలతో పాటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. రకరకాల ఫోటో షూట్స్, వీడియోలతో అభిమానులను కవ్విస్తున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా మంచి గుర్తుంపు తెచ్చుకుంటుంది ఈ చిన్నది విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఈ చిన్నది.. తాజాగా శివలింగం దగ్గర నెమలిలా నాట్యం చేసింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? తన అందంతో పాటు నటనతోనూ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.
ఇండస్ట్రీలో రాణిస్తున్న తెలుగమ్మాయిల్లో ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యకంగా చెప్పుకోవాలి.. నటిగా ఒకొక్క మెట్టు ఎక్కుతూ వస్తుంది ఈ చిన్నది. ఆమె ఎవరో కాదు అనన్య నాగళ్ల. సినిమాలపై ఇంట్రెస్ట్ తో సాఫ్ట్ వేర్ జాబ్ మానేసింది అందాల భామ అనన్య నాగళ్ల. షార్ట్ ఫిల్మ్స్ తో మరో కొత్త జీవితం ప్రారంభించింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ అనతికాలంలోనే తెలుగు నాట క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఓవైపు హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే, మరోవైపు సహాయనటిగా ఇతర హీరోయిన్స్ చిత్రాల్లోనూ మెప్పిస్తోందీ ఈ చిన్నది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అనన్య గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అనన్య శివ లింగం దగ్గర నాట్యం చేస్తూ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. నేను ప్రొఫెషనల్ డ్యాన్సర్ని కాదు.. కాబట్టి ఏవైనా తప్పులు ఉంటే దయచేసి నన్ను క్షమించండి అంటూ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో అనన్య నాట్యం, ఆమె హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. అనన్య డాన్స్ పై ప్రశంసలు కురిపిస్తూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.