
చిన్నారి పెళ్లి కూతురిగా ఎంతో ముద్దుగా కనిపిస్తున్న అమ్మాయి.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. అందం, అభినయంతో అడియన్స్ మనసులు గెలుచుకుంది. కానీ నటిగా మాత్రం సరైన క్రేజ్ అందుకోలేకపోయింది. ఆమె ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యాయి. దీంతో ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గిపోయాయి. కానీ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చూస్తే మెంటలెక్కిపోద్ది. నిత్యం గ్లామర్ ఫోజులతో ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీలో సైలెంట్ అయిన ఈ అమ్మడు.. ఇప్పుడు వరుసగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? కెరీర్ మొదట్లోనే ఇద్దరు స్టార్ హీరోలతో డేటింగ్ అంటూ రూమర్స్ వచ్చాయి. అయితే తన గురించి వస్తున్న వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు నెట్టింట మోస్ట్ ట్రెండింగ్ హీరోయిన్లలో ఈ వయ్యారి ఒకరు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? కుర్రకారు దిల్ క్రష్.. నిధి అగర్వాల్. బెంగుళూరుకు చెందిన ఈ అమ్మడు హైదరాబాద్ లోనే పెరిగింది. చదువు మధ్యలోనే నటనపై ఆసక్తితో మోడిలంగ్ రంగంలోకి అడుగుపెట్టింది.
అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో నిధికి సరైన గుర్తింపు రాలేదు. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించింది. కానీ రెండోసారి సైతం ఆమెకు నిరాశ ఎదురైంది. కానీ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో సౌత్ ఇండస్ట్రీలో ఈ అమ్మడు క్రేజ్ మారిపోయింది. తెలుగులో అంతగా అవకాశాలు రాకపోయినా.. తమిళంలో మాత్రం ఆఫర్స్ క్యూ కట్టాయి. అదే సమయంలో కోలీవుడ్ స్టార్ శింబుతో ప్రేమలో పడిందని.. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ నడిచింది. అయితే ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది నిధి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన హరి హర వీరమల్లు చిత్రంలో నటిస్తుంది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జోడిగా రాజాసాబ్ చిత్రంలో కనిపించనుంది. ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ రెండు చిత్రాల తర్వాత నిధి క్రేజ్ మారిపోనున్నట్లు తెలుస్తోంది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..
 (@nidhhiagerwal)