Most Recent

OTT Movie: వింత వ్యాపారంతో హీరో కష్టాలు.. పొట్టచెక్కలయ్యే డార్క్ కామెడీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

OTT Movie: వింత వ్యాపారంతో హీరో కష్టాలు.. పొట్టచెక్కలయ్యే డార్క్ కామెడీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

కంటెంట్ నచ్చితే చాలు స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినా సినిమా సూపర్ హిట్ అవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా కథ బలంగా ఉండే బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో మలయాళంలో రిలీజ్ అవుతున్న చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాంటి వాటిలో పోన్ మ్యాన్ ఒకటి. ఎలాంటి హడావిడి, అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై విజయం సాధించిన సినిమా ఇది. ఈ ఏడాది జనవరి 30న విడుదలైన ఈ డార్క్ కామెడీ మూవీలో బేసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో నటించాడు. అంతకు ముందు జయ జయ జయహే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు బేసిల్. ఈ చితర్ంలో సజిన్ గోపు, లిజొమోల్ జోస్, ఆనంద్ మన్మధన్, దీపక్ పరంబోల్ కీలకపాత్రలు పోషించారు. జోతిష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను నాలంచు చేరుప్పకర్ అనే నవల ఆధారంగా తెరకెక్కించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ లో మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు మేకర్స్. “ఈ బంగారు మనిషి మెరుస్తాడు. పోన్ మ్యాన్ మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది” అనే క్యాప్షన్ తో జియో హాట్ స్టార్ మలయాళం ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చింది. అలాగే ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. మలయాళంలో బేసిల్ జోసెఫ్ స్టార్ హీరో. అతడి సినిమాలు కొన్ని రోజులుగా వరుస హిట్స్ అవుతున్నాయి.

కథ విషయానికి వస్తే..
పోన్ మ్యాన్ అంటే గోల్డ్ మ్యాన్ అని అర్థం. ఈ చిత్రంలో పీసీ అజేష్ అనే పాత్రలో బేసిల్ కనిపించగా.. తన దగ్గర ఉన్న బంగారాన్ని పెళ్లి కూతురు ఇంట్లో వాళ్లకు ఇచ్చి. పెళ్లిలో వచ్చే డబ్బు మొత్తం తనకు ఇవ్వాలని షరతులు పెట్టే వ్యాపారం చేస్తుంటాడు. కానీ ఓ కుటుంబానికి 25 సవర్ల బంగారం ఇవ్వగా.. కేవలం 13 సవర్లే తిరిగి చెల్లిస్తుంది. మిగిలిన 12 సవర్ల కోసం అజేష్ డిమాండ్ చేయగా.. ఆ ఫ్యామిలీతో వివాదం మొదలవుతుంది. ఆ తర్వాత అజేష్ పరిస్థితి ఏమవుతుంది ? అనేది సినిమా. ఈ మూవీ మార్చి 14 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.