-
దేవర అండర్ వాటర్ సీక్వెన్స్ చేయడానికి చాలా శ్రమపడాల్సి వచ్చింది. గోవాలో సముద్రంలో సీన్స్ చేస్తున్నప్పుడు సిట్చువేషన్ మామూలుగా లేదు. దేవర కోసం మా ఆర్ట్ డైరక్టర్ ప్రత్యేకంగా బోట్స్ తయారు చేశారు అంటూ దేవర సీ సీక్వెన్స్ గురించి చాలానే చెప్పేశారు మేకర్స్.
-
వాళ్లు తెర వెనుక పడ్డ కష్టమంతా తెరమీద అందంగా కనిపిస్తుంటే, శ్రమను మర్చిపోతున్నారు. దేవర సీక్వెల్లోనూ సముద్రపు జోరుని చూపించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా విడుదలైన తొలిరోజే 172 కోట్లపైనే వసూళ్లు అయింది.
-
ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేస్తామంటున్న తండేల్ మూవీ కూడా సముద్రం బ్యాక్‌డ్రాప్‌లోనే జరుగుతుంది. ఉత్తరాంధ్రలో జరిగే ప్రేమకథగా రూపొందిస్తున్నారు. లవ్‌స్టోరీకి, దేశభక్తిని ముడిపెడుతూ, ఉత్తరాంధ్ర నేపథ్యంతో తెరకెక్కిస్తున్నారు చందు మొండేటి.
-
ఇటు కేజీయఫ్ త్రీక్వెల్ కూడా సముద్రం నేపథ్యంలోనే ప్రధానంగా సాగనుంది. తాను అప్పటిదాకా తయారు చేయించిన బంగారాన్నంతా తీసుకుని సముద్రంలోకి వెళ్తాడు రాకీ భాయ్. అక్కడి నుంచి అతను ఎలా బయటపడ్డాడు? అక్కడి నుంచి ఎటు వెళ్తాడు? ఏం చేస్తాడనేది త్రీక్వెల్ కథ.
-
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా కూడా సీ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుంది. ఓజీ చూద్దురుగానీ బావుంటుంది అంటూ ఫ్యాన్స్ కి ఈ సినిమా గురించి ఇప్పటికే పాజిటివ్ హింట్ ఇచ్చేశారు పవన్ కల్యాణ్. ఓజీలో సీ బ్యాక్‌డ్రాప్‌ని ఎంతగా వాడుకుంటారో తెలియాలంటే లెట్స్ వెయిట్ అండ్ సీ...