సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఆయనకు గుండెకు సంబంధించిన పలు వైద్య పరీక్షలను మంగళవారం చేయాల్సి ఉండడంతో సోమవారం రాత్రి చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు రజినీ. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నట్లు సమాచారం. అయితే రజినీ ఆసుపత్రిలో చేరడంపై అటు వైద్యులు, ఇటు కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మంగళవారం రజినీకి ఎలక్టివ్ విధానాన్ని షెడ్యూల్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం రజినీ వయసు 73 సంవత్సరాలు. కొన్నిరోజులుగా వేట్టయాన్, కూలీ చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడు రజినీ.
ఇదిలా ఉంటే.. జై భీమ్ దర్శకుడు TJ జ్ఞానవేల్ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న వేట్టయాన్ చిత్రం అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానుంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాతోపాటు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న కూలీ చిత్రంలో నటిస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.