బిగ్ బాస్ సీజన్ 8లో అనుకున్నదే జరిగింది. అందరూ ఊహించినట్టే సోనియా ఆకుల ఎలిమినేట్ అయ్యింది. ఆదివారం కావడంతో నాగ్ హౌస్‌లో ఉన్న వారితో సరదాగా కొన్ని గేమ్స్ ఆడించారు. ఆ తర్వాత నామినేషన్స్ లో ఉన్న ఒకొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చారు నాగ్. చివరకు సోనియా ఎలిమినేట్ అంటూ ప్రకటించేశారు. స్టేజ్ మీదికి వచ్చిన తరువాత.. నాగార్జున సోనియా జర్నీని చూపించారు హౌస్ లోకి వచ్చిన తర్వాత నుంచి సోనియా హ్యాపీ మూమెంట్స్ అలాగే ఎమోషనల్ మూమెంట్స్ అన్ని చూపించారు. దానికి సోనియా గుడ్ వన్ సార్ అని అంది. అది విని నాగ్ అవాక్ అయ్యారు. ‘గుడ్ వన్?! ఏంటీ కొంచెం షాక్‌లో ఉన్నావా?’ అని సోనియాను అడిగారు నాగార్జున.
ఇది కూడా చదవండి :అమ్మబాబోయ్..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సింహాద్రి హీరోయిన్
నేను ఉదయం నుంచి బయటికి రావడానికి రెడీగానే ఉన్నాను.. నిజానికి నేను హౌస్ లో ఒంటరిని అయిపోయాను.. నేను కాలేజ్‌లో కూడా అంతే.. నన్ను అంతగా ఎవరూ ఇష్టపడరు. కానీ నేను మారను.. ఉన్నది ఉన్నట్లు చెబుతాను.. తప్పు అయితే తప్పు.. ఒప్పు అయితే ఒప్పు అని చెబుతాను.. అంటూ సోనియా చెప్పుకొచ్చింది ఇంతలో నాగ్ మధ్యలో అది చాలా మందికి నచ్చదు అని కౌంటర్ వేశారు. దానికి సోనియా అవును నచ్చదు సార్.. కానీ నేను మార్చుకోదలచుకోలేదు అని చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి : ఏందో మావ.. నిన్న మొన్నటి చైల్డ్ ఆర్టిస్ట్‌లు.. ఇప్పుడు ఇలా షాక్‌లు ఇస్తున్నారు..!
నేను ఏం అనుకుంటా అంటే.. నేను నేర్చుకున్నది ఏదైతే ఉందో అది నా జీవితం నుంచి నేర్చుకున్నా.. చెబితే మంచిగా ఉంటుందని. కానీ చెప్పే పద్దతి మార్చుకుంటే బాగుండు అని చాలా సార్లు అనుకున్నా.. ట్రై చేశా.. అలాగే ఇంత మార్చుకుంటూనే ఇక్కడి వరకూ వచ్చిన నేను.. లాస్ట్ వీక్ ఎగ్ గేమ్ ఆడినప్పుడు చాలా ఆలోచించా సార్.. ఫిజికల్ అవ్వడానికి చాలా ఆలోచించాను. ఎందుకంటే నేను కరాటే.. సెల్ఫ్ డిఫెన్స్ కోసం నేర్చుకున్నాఅని చెప్పుకొచ్చింది. అలాగే నేను మీ జడ్జిమెంట్ కోసం వెయిట్ చేశా సార్.. ముందు వారం మీరు నాకేం చెప్పలేదు.. సెల్ఫ్ డౌట్ వద్దని అన్నారు. కాబట్టి నేను బాగానే ఆడుతున్నానని అనుకున్నా అంటూ చెప్పుకొచ్చింది సోనియా..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.