మలయాళీ సినీ పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ రూపొందించిన నివేదిక తీవ్ర దుమారం రేపుతుంది. ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఆ రిపోర్టులో ఎన్నో దిగ్ర్భాంతికర విషయాలు వెలుగుచూశాయి. మహిలలు కాస్టింగ్ కౌచ్ నుంచి వివక్ష వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమ కమిటీ పేర్కొంది. ఈ క్రమంలోనే మలయాళీ నటి రేవతి సంపత్ సీనియర్ నటుడు సిద్ధిఖీ పై సంచలన ఆరోపణలు చేసింది. దీంతో ఆమె వ్యాఖ్యలతో మలయాళం ఇండస్ట్రీలో పెద్ద దుమారమే రేగుతుంది. అంతేకాదు రేవతి ఆరోపణలతో సిద్ధిఖీ ఏకంగా అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ (AMMA) నుంచి తప్పుకుంటూ తన పదవికి రాజీనామా చేశారు. ఇన్నాళ్లు జనరల్ సెక్రటరీగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేసి తాజాగా ఆ లేఖను AMMA ప్రెసిడెంట్ మోహన్ లాల్ కు అందచేశాడు.
2019లోనే సిద్ధిఖిపై నటి రేవతి సంపత్ తీవ్ర ఆరోపణలు చేశారు. తాజాగా హేమ కమిటీ నివేదిక రూపొందించిన అనంతరం మరోసారి సిద్ధిఖి గురించి సంచలన కామెంట్స్ చేశారు. 2016లో తిరువనంతపురంలో నీలా థియేటర్లలో సిద్ధిఖి నటించి సుఖమరియతే సినిమా ప్రివ్యూ అనంతరం తనపై అతడు లైంగిక దాడి చేసి తనను హింసించాడని తెలిపింది. తన కొడుకు నటించబోయే సినిమాలో ఆఫర్ గురించి మాట్లాడేందుకు సిద్ధిఖి తనను సంప్రదించాడని.. తనను తన కూతురు అని పిలిచేవాడని అందుకే మొదట్లో అనుమానం రాలేదని.. కానీ ఆ తర్వాతే తనపై లైంగిక దాడి చేశాడని తెలిపింది. సుఖమరియతే సినిమా ప్రివ్యూ అనంతరం మస్కట్ హోటల్ కు తనను తీసుకెళ్లి అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని..ఎదురుతిరిగినందుకు తనపై దాడి చేశాడని.. హోటల్ గదిలో బిక్కుబిక్కుమంటూ నరకం చూశానని తెలిపింది. ఆ భయానక సంఘటన నుంచి ఇప్పటికీ తాను కోలుకోలేకపోతున్నానని.. సిద్ధిఖీ చాలా నీచమైన వ్యక్తి అంటూ తన స్నేహితులపై కూడా ఆయన లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది.
నటి రేవతి సంపత్ చేసిన ఆరోపణలు ఇప్పుడు మలాయళీ ఇండస్ట్రీ తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో ప్రస్తుతం AMMAలో జనరల్ సెక్రటరీగా ఉన్న సిద్ధిఖీ తన పదవికి రాజీనామా చేశారు. ఇండస్ట్రీలో అందరికీ న్యాయం చేస్తానని కామెంట్స్ చేసిన సిద్ధిఖీ కొన్ని గంటల్లోనే తన పదవి నుంచి తప్పుకున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.