డీఎండీకే అధ్యక్షుడు, సినీనటుడు విజయకాంత్ ఇటీవల అనారోగ్యంతో మళ్లీ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. స్థానిక మియాట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కొద్దిరోజుల క్రితమే డిశ్చార్జీ అయిన ఆయన.. మళ్లీ అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను మంగళవారం కుటుంబసభ్యులు మియాట్ ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో ఆయనకు ఇన్ఫెక్షన్ సోకిందని.. టెస్టులు చేయగా కరోనా సోకినట్లు నిర్ధారించారు వైద్యులు. వైద్య పరీక్షల్లో విజయకాంత్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో ఆయనకు వెంటిలేటర్ చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రముఖ తమిళ్ పత్రికలో వెల్లడించారు.
డీఎండీకే అధినేత విజయకాంత్ అనారోగ్య కారణాలతో కొన్నేళ్లుగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. కొన్నాళ్లుగా పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత ఎప్పటికప్పుడు ఆసుపత్రికి వెళ్లి వైధ్యపరీక్షలు చేయించుకుంటున్నాడు. ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న విజయకాంత్‌కు దగ్గు, జ్వరం, జలుబు రావడంతో గత నెల 18న చెన్నై గిండి సమీపంలోని మణపాక్‌లోని మియాట్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఐసీయులో చికిత్స అందించారు వైధ్యులు. తనకు తానుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడడంతో కొన్నాళ్లు కృత్రిమ శ్వాస అందించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆయన ఆరోగ్యం బాగుండడంతో ఈనెల 12న ఆయనను డిశ్చార్జీ చేశారు వైద్యులు.
Tamil Nadu | DMDK Leader Vijayakanth tested positive for COVID. Due to breathing issues, Vijayakanth has been put on a ventilator: Desiya Murpokku Dravida Kazhagam (DMDK) pic.twitter.com/5XoF1HQhDv
— ANI (@ANI) December 28, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.