Most Recent

Salman Khan: సల్మాన్ ఖాన్ మల్టీటాలెంటెడ్.. చేతివేళ్లతో అద్భుతమైన ఆర్ట్.. వీడియో వైరల్..

Salman Khan: సల్మాన్ ఖాన్ మల్టీటాలెంటెడ్.. చేతివేళ్లతో అద్భుతమైన ఆర్ట్.. వీడియో వైరల్..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నటుడలలో ఒకరు. కేవలం ఉత్తరాదిలోనే కాదు.. దక్షిణాదిలోనూ ఈ హీరోకు అభిమానులు ఎక్కువే ఉన్నారు. ఈరోజు సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సల్లూభాయ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. ఇన్నాళ్లు నటుడిగా మాత్రమే ప్రేక్షకులకు పరిచయం ఉన్న సల్మాన్.. మంచి ఆర్టిస్ట్ కూడా. అద్భుతమైన కళాకారుడు. పెయింటింగ్ పట్ల అతనికి ప్రత్యేకమైన ప్రేమ ఉంది. ఇప్పటివరకు అనేకరకాల పెయింటింగ్స్ వేసి అదుర్స్ అనిపించుకున్నాడు సల్మాన్.

ముఖ్యంగా చేతివేళ్లతోనే అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తుంటారు సల్మాన్. పన్వెల్ లోని తన ఇంటిలో ఎన్నోరకాల పెయింటింగ్స్ వేశాడు సల్మాన్. అతను సృష్టించిన ప్రతి ఆర్ట్ అందరి దృష్టిని ఆకర్శిస్తుంది. గతంలో సల్మాన్ వేసిన పెయింటింగ్స్ కోట్లలో అమ్ముడయ్యాయి. తన సోదరి అర్పితా ఖాన్, బావ ఆయుష్ శర్మకు ఖురాన్ నుంచి ఓ అందమైన కళాకృతిని చేతివేళ్లతో పెయింటింగ్ చేశాడు సల్మాన్ అందుకు సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

అలాగే తమ సోదరి కొత్త ఇంటికి మారినప్పుడు తమ గదిలోని గోడలకు మంచి ఆర్ట్ పీస్ కావాలని తన బావ ఆయుష్ కోరగా.. స్వయంగా తన చేతులతో అద్భుతమైన పెయింటింగ్ వేసిచ్చాడు సల్మాన్. మూడు దశాబ్దాలకుపైగా కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు సల్మాన్. అలాగే ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్నాడు. చివరిసారిగా సల్మాన్ టైగర్ 3 చిత్రంలో కనిపించాడు. ఇందులో కత్రీనా కైఫ్ హీరోయిన్ గా నటించింది.

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.