Most Recent

Bigg Boss 7 Telugu: శోభా పై నాగార్జున సీరియస్.. దెబ్బకు కన్నీళ్లు పెట్టుకుంది..

Bigg Boss 7 Telugu: శోభా పై నాగార్జున సీరియస్.. దెబ్బకు కన్నీళ్లు పెట్టుకుంది..

Bigg Boss 7 Telugu: శనివారం వచ్చిందంటే చాలు బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చి నాగార్జున హౌస్ మేట్స్ కు క్లాస్ తీసుకుంటుంటారు. ఎప్పటిలానే నిన్నటి ఎపిసోడ్ లో కూడా నాగార్జున హౌస్ మేట్స్ పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఒకొక్కరి ఆట తీరు గురించి చెప్తూ క్లాస్ తీసుకున్నారు నాగార్జున. నవ్వుతూనే స్వీట్ వార్నింగ్స్ ఇచ్చారు నాగ్. ముఖ్యంగా అమర్ దీప్ పై నాగార్జున్ ఓ రేంజ్ లో సీరియస్ అయ్యారు. ఏకంగా అమర్ ను పిచ్చినా కొడకా అనేశారు నాగ్. నిన్నటికి ఎపిసోడ్ లో ముందుగా ఓట్ అపీల్ ఛాన్స్ మిస్ చేసుకున్న యావర్, అమర్, ప్రశాంత్, ప్రియాంకల మరో ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ నలుగురికి కలిపి ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ టాస్క్ లో ప్రియాంక విన్ అయ్యింది. దాంతో తన ఓట్ అపీల్ చేసుకుంది. ఒక అమ్మాయి ఫస్ట్ టైమ్ టైటిల్ గెలుస్తుందని అనుకుంటున్నాను.. అంటూ తన ఓట్ అపీల్ చేసుకుంది.

ఇక ఆ తర్వాత నాగార్జున అందుకున్నారు. ముందుగా అమర్ దీప్ కెప్టెన్సీ ఎలా ఉంది అని హౌస్ మేట్స్ ను అడిగారు. అందరూ బావుందని చేతులెత్తారు. కెప్టెన్ అంటే అథారటీనా, లేక అడుక్కోవడమా అమర్ అంటూ అమర్ కు పంచ్ వేశాడు నాగ్. ఇక ఈ వారం మొత్తంలో అర్జున్ చాలా బాగా ఆడాడని మెచ్చుకున్నారు. నెక్స్ట్ బాగా ఆడింది ప్రియాంక అని చెప్పారు.

డ మీద ఫొటోలు పెట్టి సుత్తితో పగల గొట్టారు నాగార్జున. ముందుగా శోభా ఫోటో పగలగొట్టి కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారు నాగ్. గతంలో ఈవారం నాగ్ సార్ పిలిచినప్పుడు అన్ని చెప్తాను అన్న వీడియోను ప్లే చేశారు. ఆతర్వాత ఇప్పుడు చెప్పమ్మా ఏంటి అని నాగ్ అడ్దగ్గనే మొదలు పెట్టేసింది శోభా. శివాజీ ప్రతిసారి వేరే భాష నుంచి వచ్చాము అని, ఫేవరిజం  అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు అని చెప్పింది. బాల్స్ టాస్క్ లో సంచాలక్‌గా నువ్వు ప్రియాంకకి సపోర్ట్ చేయడం రైటా..అని ప్రశ్నించారు నాగ్. దానికి శోభా కవర్ చేయాలనీ బాగానే ట్రై చేసింది. కానీ నాగ్ ఎక్కడికక్కడ ఆమె గాలితీసేశారు. సపోర్ట్ చేస్తానని నువ్వు డైరెక్ట్‌గా అలా చెబితే ఫేవరిజం అనే అంటారు కదా.. నువ్వు చేసింది అదే అన్నారు నాగ్. హౌస్ కో ఉన్నవారందరూ ఈ వీకే నేను ఎలిమినేట్ అవుతున్నా అన్నట్లుగా మాట్లాడుతున్నారు సార్.. అందుకే నేను చాలా డిస్ట్రబ్ అయ్యాను.. ఓటింగ్‌లో నేను బాటమ్ టూలో ఉన్నానని మీరు అంటే నేను స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాను అన్యు ఏడుపు మొదలు పెట్టింది. చివరకు నాగార్జున దైర్యం చెప్పి పంపించారు.

ఆతర్వాత యావర్ ను పిలిచారు నాగ్.. యావర్ పై కూడా నాగార్జున సీరియస్ అయ్యారు. ఆ లాంగ్వేజ్ ఏంటి ఆ బిహేవియర్ ఏంటి.. ఛీ థూ.. నీకు ఎలా ఉంది ఇలా అంటుంటే.. నీ బిహేవియర్‌కి మేము ఇలానే అంటున్నాం ఇప్పుడు అంటూ యావర్ పై సీరియస్ అయ్యారు నాగార్జున. అక్కడ యాక్షన్ చిన్నదే.. కానీ రియాక్షన్ పెద్దది.. అంటూ సీరియస్ అయ్యారు. శోభాకి నువ్వు సారీ చెప్పాలి అని నాగార్జున చెప్పారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.