Most Recent

Bigg Boss Telugu 7: ఎవరి తప్పులు వాళ్లు ఒప్పుకున్నారు.. శివాజీ, శోభా ఏం చెప్పారంటే

Bigg Boss Telugu 7: ఎవరి తప్పులు వాళ్లు ఒప్పుకున్నారు.. శివాజీ, శోభా ఏం చెప్పారంటే

బిగ్ బాస్ హౌస్ లో అనుకున్నదే జరిగింది. ఇంకా ఒక్కవారమే ఉండటంతో ఎవరు ఫైనలిస్ట్ అవుతారు అన్నదాని పై టెన్షన్ నెలకొంది. నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఫైనలిస్ట్ ఎవరు అనేది కన్ఫామ్ చేసేశారు. సండే ఫన్ డే గా జరిగింది. ఆడుతూ పాడుతూ జరిగిన ఈ ఎపిసోడ్ లో నాగార్జున వరుసగా ఫైనలిస్ట్ లను అనౌన్స్ చేశారు. వచ్చి రాగానే సెకండ్ ఫైనలిస్ట్ అంటూ ప్రియాంకను అనౌన్స్ చేశారు నాగార్జున దాంతో అమ్మడు ఆనందంలో తేలిపోయింది. ప్రియాంక సంబరపడుతుంటే శోభా శెట్టి మొఖం మాత్రం మాడిపోయింది. ఆతర్వాత అందరిని పిలిచి. అక్కడ ఒక వీల్ ను ఉంచారు. దాని మీది 1 నుంచి 14 వారలు రాసి ఉంచారు. ఆ వీల్ ను తిప్పి ఈ 14వారాల్లో మీకు బ్యాడ్ వీక్ ఏది.. ? మీరు రీగ్రేట్ అయిన వీక్ ఏది.? ఎందుకు అని చెప్పాలని చెప్పారు నాగ్.

ముందుగా ప్రియాంక వీల్ తిప్పి 7వారం తన ప్రవర్తనకు రొగ్రెట్ అవుతున్నట్టు చెప్పింది. ఆ రోజు నామినేషన్స్ లో తెలిసో తెలియకో ఒక మాట అనేశాను. భోలే అన్న విషయంలో అది అనకుండా ఉండాల్సింది అని తెలిపింది. ఆతర్వాత అర్జున్ అర్జున్ అయితే 13వ వారం ఓటింగ్‌లో లాస్ట్ లో ఉన్నాను. అప్పుడే బలంతో బలగం కూడా కావాలి అని తెలిసింది అని చెప్పుకొచ్చాడు. శోభా అయితే 9వ వారం గురించి చెప్తూ.. ఆ వారం నేను చాలా రిగ్రెట్ అవుతున్నాను.. ఆ రోజు నాగ్ సార్ కూడా నన్ను తిట్టారు. నేను యావర్ ను పిచ్చోడు అన్న మాటకు.. అది అనకుండా ఉండాల్సిందని చెప్పింది.

ఇక అమర్ 14 వారం గురించి చెప్పాడు. అసలు ఈ వారం అంతా నేను ఏం చేశానో నాకే తెలియదు సార్. పిచ్చోడిని అయ్యానో కూడా తెలియదు సార్ అని చెప్పాడు. యావర్ నాకు రిగ్రెట్ ఫీలయ్యే వీక్స్ చాలానే ఉన్నాయ్ సార్ అని అన్నాడు. ఫస్ట్ వీక్.. అలానే 11వ వారంలో ఎవిక్షన్ పాస్ గెలుచుకోలేకపోయాను సార్ అని చెప్పాడు. అలాగే 13 వారంలో ఫినాలే అస్త్ర గెలవలేకపోయాను..14 వారం శోభను ఛీ అన్నాను.. ఇవన్నీ తలుచుకుంటే భాదగా ఉంది అని అన్నాడు.ప్రశాంత్ 14 వారం గురించి రిగ్రెట్ అవుతున్నా అని చెప్పాడు. ఎవ్వరికి తెలియకుండా కాఫీ పొడి శివాజీ అన్నకు తెచ్చి ఇచ్చాను.. అని చెప్పాడు. శివాజీ కూడా 14వారం గురించే చెప్పాడు.ఆ వీక్‌లో నేను వాడిన పదాలు, మాటలు నా వ్యక్తిగతం అనుకున్నాను.. కానీ అవి బయట వ్యక్తులని కూడా బాధపెట్టాయని మీరు చెప్పాకే అర్థమైంది.. నిజానికి నేను ఓ పల్లెటూరోడ్ని.. అవి ఊతపదంగా వచ్చినవే కానీ కావాలని అన్నవి కాదంటూ శివాజీ  చెప్పుకొచ్చాడు. ఆతర్వాత వరుసగా వరుసగా మీమ్స్ వేసి చూపించారు నాగార్జున.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.