Most Recent

SS Rajamouli Birthday Special: టాలీవుడ్ దర్శక ధీరుడు.. డైరెక్టర్ రాజమౌళి బర్త్ డే నేడు

SS Rajamouli Birthday Special: టాలీవుడ్ దర్శక ధీరుడు.. డైరెక్టర్ రాజమౌళి బర్త్ డే నేడు

దర్శక ధీరుడిగా రాజమోళికి మంచి పేరు ఉంది. ఇప్పటివరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన ఒక్క సినిమా కూడా ఫ్లాప్ లేదు. రాజమౌళి సినిమా అంటే ఓ బ్రాండ్ ఉంది. ఆయనతో సినిమా చేయాలని ప్రతి ఒక్క హీరో ఎదురుచూస్తూ ఉంటారు. నేడు ఈ దిగ్గజ దర్శకుడి పుట్టిన రోజు. దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాదు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేశారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన బాహుబలి సినిమా విడుదలైన అన్ని భాషల్లో సంచలన విజయం సాధించడంతో పాటు 1500కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి సంచలనం క్రియేట్ చేశారు.

టాలీవుడ్ బిగ్ స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలతో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా ఆస్కార్ అవార్డు  వచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరు హీరోలను పెట్టి సినిమా చేయడం అంటే మాటలు కాదు. అందులోనూ ఆ ఇద్దరు హీరోలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరు అభిమానులను తృప్తి పరిచేలా సీన్స్ తెరకెక్కించాలి. ఆ విషయంలో రాజమౌళి సక్సెస్ అయ్యారు.

 

View this post on Instagram

 

A post shared by SS Rajamouli (@ssrajamouli)

ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు రాజమౌళి. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో రానున్న సినిమా పనులు త్వరలోనే మొదలు కానున్నాయి. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే రాజమౌళి సినిమా మొదలు కానుంది. ఇక ఈ సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. రాజమౌళి ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తారన్నది చూడాలి. మహేష్ బాబు సినిమాతో రాజమౌళి మరో రికార్డ్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు అభిమానులు.

రాజమౌళి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by SS Rajamouli (@ssrajamouli)

రాజమౌళి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by SS Rajamouli (@ssrajamouli)

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.