Most Recent

Leo Movie: లియో సినిమాకు ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారంటే..!

Leo Movie: లియో సినిమాకు ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ అందుకున్నారంటే..!

దళపతి విజయ్ నటిస్తున్న నయా మూవీ లియో.. లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు (శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విక్రమ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న లోకేష్ లియో సినిమాను ఎలా తెరకెక్కిస్తారు.. విజయ్ పాత్ర ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే లియో సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ , సాంగ్స్, టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా పై ఉన్న అంచనాలను ఆకాశానికి చేర్చింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారన్నది ఒక్కసారి చూద్దాం. మాములుగానే విజయ్ రెమ్యునరేషన్ భారీగా ఉంటుంది. ఒకొక్క సినిమాకు షేరింగ్ తో కలిపి దాదాపు 80 కోట్ల వరకు అందుకుంటుంటాడు.  ఇక లియో సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడంటే..

మొత్తంగా లియో సినిమాను 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా రూ. 120 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఇప్పటివరకు విజయ్ ఈ రేంజ్ లో ఏ సినిమాకు రెమ్యునరేషన్ అందుకోలేదు. అలాగే దర్శకుడు లోకేష్ కానగరాజ్ 8 కోట్లు అందుకుంటున్నాడు.

ఇక మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ మూవీకోసం 10 కోట్ల వరకు అందుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సంజయ్ దత్ రూ.8 కోట్లు, హీరోయిన్ త్రిష రూ.5 కోట్లు, యాక్షన్ కింగ్ అర్జున్ రూ.కోటి, హీరోయిన్ ప్రియా ఆనంద్ రూ.50 లక్షలు, ఇక గౌతమ్ మేనన్, మిస్కిన్ రూ.30-50 లక్షల మధ్య తీసుకున్నారట.

లియో మూవీ ట్విట్టర్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.