బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సినిమాలకంటే వివాదాలతో ఈ చిన్నది ఎక్కువ పాపులర్ అయ్యింది. ఇప్పటికే చాలా కాంట్రవర్సీలో ఈ అమ్మడు పేరు వినిపిస్తుంది. తన సొంత ఇండస్ట్రీ పైనే షాకింగ్ కామెంట్స్ చేసింది కంగన. ఇక ఈ బ్యూటీ ఇటీవలే చంద్రముఖి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఎమర్జెన్సీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఎమర్జెన్సీ’ నవంబర్ 24న విడుదల కానుంది. అయితే ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడిందని తెలుస్తోంది. దీనికి కారణం సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమా అని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ ‘ టైగర్ 3′ విడుదల కారణంగా కంగనా రనౌత్ సినిమా విడుదల తేదీ వాయిదా పడిందని టాక్ వినిపిస్తోంది.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో ‘ఎమర్జెన్సీ’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు మరోసారి సినిమా వాయిదా పడింది. కంగనా సినిమా విడుదల తేదీ ఏకంగా 2024కి వాయిదా పడింది.
ఈ మేరకు కంగనా తన సోషల్ మీడియాలో.. మిత్రులారా, నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆర్టిస్టుగా నేను నేర్చుకున్న జ్ఞానాన్ని, సంపాదించిన డబ్బును ఎమర్జెన్సీ సినిమాకు పెట్టాను. ఎమర్జెన్సీ అనేది నాకు సినిమా మాత్రమే కాదు, ఒక వ్యక్తిగా నా విలువకు, పాత్రకు పరీక్ష. టీజర్‌కి వచ్చిన మంచి రెస్పాన్స్ మాలో కొత్త శక్తిని నింపింది. నవంబర్ 24న సినిమాను విడుదల చేస్తాం అని చెప్పాం. కానీ, కొన్ని కారణాల వల్ల విడుదల తేదీ 2024కి వాయిదా పడింది’ అని తెలిపింది. సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ 3’ దీపావళి సందర్భంగా విడుదల కానుంది. టైగర్ 3 రిలీజ్ కారణంగానే కంగనా తన సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకుందని అంటున్నారు.
View this post on Instagram
కంగనా రనౌత్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..