ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు విడుదలై బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న చిత్రాలను మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తూ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తున్నారు మేకర్స్. అదనంగా వీడియో క్లారిటీ, సౌండ్ క్లారిటీని పెంచుతూ విడుదల చేస్తుండడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇలా రీరిలీజ్ అయిన చిత్రాలు కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు చాలా సినిమాలు ఇలా మళ్లీ విడుదలై థియేటర్లలో హంగామా చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ జాబితాలో మరో చిత్రం వచ్చి చేరనుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో భారీ విజయాలను అందుకున్న చిత్రాల్లో ఒకటైన శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాన్ని మళ్లీ విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 2004లో విడుదలైన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపిన ఈ సినిమా ప్రేక్షకులను అప్పట్లో ఉర్రుతలూగించింది. ఓవైపు మెగాస్టార్ హీరోయిజంతో పాటు కామెడీ యాంగిల్ ప్రేక్షకులను థియేటర్లకు క్యూకట్టేలా చేసింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రాన్ని మళ్లీ రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో రీరిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మెగా ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈ వార్త తెలిసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు సినిమాను థియేటర్లలో చూద్దామా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.
Mega Massive Update
Megastar @KChiruTweets Garu’s sensational hit #ShankarDadaMBBS Re-Releasing On Nov 4th
Re-release worldwide from #megaproductions#Srikanth @iamsonalibendre #PareshRawal#Sharwanand #PanjaVaishanvTej#JayanthCParanjee#AkkineniRaviShankarPrasad… pic.twitter.com/7HdOrFh183
— BA Raju’s Team (@baraju_SuperHit) October 15, 2023
19 ఏళ్ల తర్వాత మళ్లీ శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా ప్రేక్షకుల ముందకు వస్తుండడం విశేషం. ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ హెచ్‌డీ క్వాలిటీతో శంకర్‌దాదా పాటలు థియేటర్లో ప్లే అవుతే ఇక ఫ్యాన్స్ హంగామాకు అడ్డువేయడం ఎవరి తరం కాదని చెప్పడంలో సందేహం లేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..