Most Recent

Bigg Boss 7 Telugu: ‘బొంగులోది.. నువ్వు ఓ డ్యాన్స్ మాస్టర్‌వా..’ సందీప్‌ మాస్టర్‌కు ఇచ్చిపడేసిన కింగ్

Bigg Boss 7 Telugu: ‘బొంగులోది.. నువ్వు ఓ డ్యాన్స్ మాస్టర్‌వా..’ సందీప్‌ మాస్టర్‌కు ఇచ్చిపడేసిన కింగ్

బిగ్ బాస్ షోలో శనివారం జరిగే ఎపిసోడ్ కాస్త ఇంట్రెస్టింగ్‌ అండ్ స్పెషల్‌గా ఉంటుంది. ఎందుకంటే.. ప్రతీ రోజూ.. హౌస్‌లో కంటెస్టెంట్స్ వేసే వేషాలే చూస్తాము కానీ.. శనివారం ఒక్క రోజు మాత్రం.. కంటెస్టెంట్స్ వేసే వేషాలకు… మాట్లాడుకునే మాటలకు.. నాగ్ రియాక్షన్ కూడా చూస్తాం. అందుకే శనివారం ఎపిసోడ్ అందరికీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక ఇవ్వాళ్టి అంటే 56th ఎపిసోడ్‌ కూడా.. యాజ్‌ ఎక్స్‌పెక్టెటెడ్‌ సూపర్ డూపర్ గానే సాగింది. అందులోనూ నాగ్ హౌస్‌మేట్స్‌ పై విరుచుకుపడిన తీరును.. బీబీ లవర్స్‌కు విపరీతంగా కిక్కిచ్చింది.

ఇక ఇవ్వాళ్టి ఎపిసోడ్‌లో ఎప్పటి లాగే స్టన్నింగ్ లుక్స్‌తో షోను మొదలెట్టిన కింగ్ నాగార్జున.. షో బిగినింగ్‌లోనే అమర్, ప్రియాంకల మధ్య జరుగుతున్న టాక్‌ను చూసి షాక్ అవుతాడు. అప్పటి వరకు శోభతో చాలా ఫ్రెండ్లీగా ఉన్న అమర్.. తనే తనను వెన్నుపోటు పొడిచిందంటూ.. అమర్ అనడంతో… ఎక్స్‌ప్రెషన్ మారుస్తాడు. ఇక మరో పక్క శివాజీ, ప్రిన్స్ యావర్‌ల మధ్య.. శోభ తీరు గురించి డిస్కషన్ జరుగువోతుంటుంది. ఆ పక్కనే హౌస్‌ లోపల.. భోళె, అశ్విని మధ్య కూడా.. శోభ మ్యాటరే రన్‌ అవుతూ ఉంటుంది. ఇక ఇవన్నీ చూస్తున్న నాగ్.. షాకింగ్ రియాక్షన్స్ ఇస్తూ.. వీళ్లందరికీ ఇవ్వాళ మూడిందనే హింట్ బీబీ ఆడియెన్స్‌ ఇచ్చేస్తారు. ఇక ఆ తరువాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా… నేరుగా మన టీవీ అంటూ.. హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కింగ్ నాగార్జున… ఈ వారం ఒక్కొక్కరు చేసిన తప్పులను.. వారికి ఎత్తి చూపి.. క్లాస్ ఇచ్చే పని మొదలెడతారు.

నయా కెప్టెన్‌ గౌతమ్‌ను మొదట అప్రిషియేట్ చేసిన నాగ్.. సంచాలక్‌గా ఫెయిల్ అంటూ.. తన దగ్గరున్న గౌతమ్ కృష్ణ జెండాను విరిచి వేస్తాడు. సింగ్- ఫ్లోటింగ్‌ టాస్క్‌లో గౌతమ్‌ సంచాలక్‌గా ఫెయిల్ అయ్యాడంటూ.. ఓ వీడియోను చూపించి చిన్న పాటి క్లాస్ ఇస్తాడు. ఇక తర్వాత నేరుగా శోభ దగ్గరికి వచ్చిన కింగ్ నాగ్… ఓ రేంజ్‌లో క్లాస్ పీకుతాడు. లాస్ట్ వీక్ భోళె ఎర్రగడ్డ అంటే.. గింజుకున్నావ్.. మరి అదే నువ్వు ప్రిన్స్‌ను పిచ్చోడు అంటే తప్పులేదా అంటూ.. ప్రశ్నిస్తాడు. హీట్‌ ఆఫ్ ది మూమెంట్ లో అలా అన్నాను అని శోభ ఆన్సర్ చెబితే.. భోళ విషయంలో కూడా అదే జరిగింది అప్పుడు తప్పులేదా అంటూ.. ఓ వీడియోను చూపిస్తాడు నాగ్. అదే టైంలో.. ప్రిన్స్ యావర్ బిహేవియర్ కూడా బాలేదంటూ.. ప్రిన్స్‌కు కూడా క్లాస్ పీకుతాడు నాగ్. వీరి ఇద్దరి కన్వర్‌జేషన్‌లో.. బిట్లు బిట్లుగా వీడియోలు ప్లే చేస్తూ.. వారిద్దరి మధ్య ఇష్యూస్‌ను సాల్వ్‌ చేసే ప్రయత్నం చేస్తాడు కింగ్ నాగ్. శోభ, ప్రిన్స్ యావర్‌ జెండాలను కూడా విరిచేస్తాడు.

ఇక సందీప్ జెండా విరిచేస్తూ కాస్త గట్టిగానే రియాక్ట్ అయ్యారు నాగ్.  మనం బొంగులో డ్యాన్సర్‌తో మాట్లాడదాం.. అన్నారు నాగ్ దాంతో అంతా షాక్ అయ్యారు. నాగ్ మాట్లాడుతూ..  సందీప్ నువ్వు డ్యాన్స్ షో విన్ అయ్యావ్ కదా.. నువ్వు డ్యాన్సర్‌వా..?  అని ప్రశ్నించాడు నాగ్. దానికి అవును సార్ కొరియోగ్రాఫర్ కూడా అంటూ సమాధానం ఇచ్చాడు సందీప్.. అలాగే ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుండగా.. ఇంతలో నాగ్ బొంగులో సమాధానం వద్దు.. మరి డ్యాన్సర్‌వే కదా.. నన్ను డ్యాన్సర్ అనొద్దు.. అంటూ మరి ఎందుకు ఆ బొంగులో యాటిట్యూడ్ చూపించావ్.? అని సీరియస్ గా అడిగారు నాగ్.

దానికి సందీప్ లేదు సార్ అని సందీప్ చెప్పేలోగా.. బొంగు అంటే తప్పు కాదు అని అంటున్నా.. అని అన్నారు నాగ్. ఇక బొంగులో డ్యాన్సర్ అనడం కరెక్టా తప్పా.. అని ప్రశాంత్‌ని అడిగారు నాగార్జున. దానికి అది గలీజ్ పదం సార్ అని అన్నాడు ప్రశాంత్. ఇక హౌస్‌లో ఎంత మంది సందీప్ ఆ పదం వాడటం కరెక్ట్ కాదనుకుంటున్నారని నాగ్ అడగ్గానే మెజారిటీ మెంబర్స్ తప్పు అనే చేయి ఎత్తారు. దీంతో సందీప్ ఇంకెప్పుడూ వాడనని సారీ చెప్పాడు. ఇక మన సీరియల్ స్టార్ అమర్ దీప్ పై కూడా నాగార్జున సీరియస్ అయ్యారు.

అమర్‌తో మాట్లాడుతూ ప్రశాంత్ అంటే నీకు చిన్నచూపు అని నేను అంటాను.. నువ్వేమంటావ్.? అని నాగ్ అడిగారు. దానికి అమర్ అమాయకంగా మొఖం పెట్టి లేదు సార్ అని చెప్పాడు. మరి ప్రశాంత్‌ని అన్న ఆ మాట.. సందీప్, అర్జున్ మీద ఎప్పుడైనా వాడావా..? అని నాగార్జున అడిగారు. దీంతో సారీ సార్ ఇంకెప్పుడు అలా మాట్లాడను అని అమర్ అన్నాడు. సారీ చెప్పిన తర్వాత నీకు క్షమించే గుణం ఉందా అని ప్రశాంత్‌ని నాగార్జున అడగ్గా..  క్షమించేశాను సార్ అని అన్నాడు ప్రశాంత్ దాంతో ఆ గొడవను అక్కడితో వదిలేశారు నాగార్జున.

– సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)

మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.