Most Recent

Bigg Boss 7 Telugu : “నేను గర్వంగా చెప్తున్నా మా నాన్న కూడా ఊరోడే”.. రైతుబిడ్డకు ఇచ్చిపడేసిన నాగ్

Bigg Boss 7 Telugu : “నేను గర్వంగా చెప్తున్నా మా నాన్న కూడా ఊరోడే”.. రైతుబిడ్డకు ఇచ్చిపడేసిన నాగ్

బిగ్ బాస్ హౌస్ లో రైతుబిడ్డగా సింపథీ కొట్టేస్తూ తనదైన స్ట్రాటజీతో బిగ్ బాస్ లో కంటిన్యూ అవుతున్నాడు పల్లవి ప్రశాంత్. మొదటి రోజు నుంచి అందరితో కలిసిపోతూ గేమ్ ఆడుతూ ఆకట్టుకుంటున్నాడు. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్ లో మాత్రం మనోడి సీన్ రివర్స్ అయ్యింది. రైతు బిడ్డ అన్న సింపథీతో గేమ్ ఆడుతూ వస్తున్న ప్రశాంత్ కు నిన్న నాగార్జున క్లాస్ తీసుకున్నారు. సందీప్ ప్రశాంత్ ను ఊరోడు అన్నాడు అని పెద్ద రాదంతం చేసిన ప్రశాంత్ నిన్న నాగార్జున అడిగే సరికే తెల్ల మొహం వేశాడు. నామినేషన్స్ సమయంలో ఆట సందీప్ కు, ప్రశాంత్ కు మధ్య పెద్ద గొడవే జరిగింది. ఎప్పటిలానే ప్రశాంత్ అవతల వారు చెప్పేదాని గురించి వినకుండా.. వాదించి రచ్చ చేశాడు. ఈ క్రమంలోనే సందీప్ తాను ఊరోడు అన్నాడని అరిచి గోల చేశాడు. సందీప్ నేను అలా అనలేదు అని సందీప్ చెప్పే ప్రయత్నం చేసిన కూడా ప్రశాంత్ వినలేదు.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో నాగార్జున ఇదే పాయింట్ మీద మాట్లాడాడు. ఊరోడు అనే పదం తప్పుకాదు అని ప్రశాంత్ కు క్లాస్ తీసుకున్నాడు నాగ్. అయితే ప్రతిఒక్కరం ఊరోళ్ళమే మనం ఈరోజు ఇలా ఉన్నామన్న.. కడుపునిండా తింటున్నామన్న రైతుల వల్లే.. “నేను గర్వంగా చెప్తాను మా నాన్న ఊరోడు” నేను గర్వంగా చెప్తాను ఈ మాట అని అన్నారు నాగ్.

అలాగే నామినేషన్స్ లో రచ్చ చేసిన భోలేకు కూడా గట్టిగానే క్లాస్ తీసుకున్నారు నాగ్. ఎక్కువగా సీరియస్ అవ్వకుండానే సుతిమెత్తగానే చెప్పారు నాగ్. దాంతో ఇంకోసారి ఇలా చేయను అని అన్నారు భోలే. ఇక నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లో పాము ఎవరు..? నిచ్చెన ఎవరు.? అని అడిగాడు నాగ్. దానికి

నిచ్చెన .. పాము 

ముందుగా అశ్విని .. గౌతమ్- శోభా, గౌతమ్.. అర్జున్-శివాజీ, శివాజీ.. యవర్- అమరదీప్, అమరదీప్.. అర్జున్- తేజ, అర్జున్.. గౌతమ్-శివాజీ, యవర్.. శివాజీ- గౌతమ్, పూజా.. అర్జున్- అశ్విని, ప్రియాంక.. శోభా- అశ్విని,భోలె.. శివాజీ- శోభాశెట్టి,  శోభాశెట్టి.. ప్రియాంక- భోలె, సందీప్.. శోభా- శివాజీ, తేజ.. అమరదీప్- యవర్, ప్రశాంత్.. శివాజీ- పూజా అని చెప్పుకొచ్చారు.

మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.