బిగ్ బాస్ హౌస్ మొన్నటి వరకు రచ్చ రచ్చ ఉంది కానీ నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం నవ్వులు పూయించారు బిగ్ బాస్. ఫన్నీ టాస్క్ ఇచ్చి నవ్వులు పూయించి ఆతర్వాత అసలు టాస్క్ ఇచ్చాడు. గులాబీ పురం, జిలేబి పురం అంటూ రెండు టీమ్స్ గా హౌస్ మేట్స్ ను డివైడ్ చేసి ఓ స్కిట్ చేయించాడు బిగ్ బాస్. గ్రహాంతరవాసుల స్పేస్ షిప్ ఒకటి క్రాష్ దాన్ని రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఏ టీమ్ ఎక్కువగా సాయం చేస్తే వాళ్లు విన్నర్ అవుతారని వారిలో ఒకరు కెప్టెన్ అవుతారని తెలిపారు బిగ్ బాస్. దాంతో ముందుగా రెండు టీమ్స్ గ్రహాంతర వాసులను సంతోష పెట్టాలని ఫన్నీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఊర్లో ఉండే పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు హౌస్ మేట్స్. గులాబీ పురం సర్పంచ్ గా శోభ, మాజీ సర్పెంచ్ గా తేజ అలాగే ఈ ఇద్దరు విడాకులు తీసుకున్న భార్య భర్తలు అన్నమాట. పల్లెటూరి అమ్మాయిని పెళ్లిచేసుకోవడానికి వచ్చిన ఎన్‌ఆర్ఐ గా యావర్, రూమర్స్ చెప్పే టీషాపు ఓనర్ గా అమర్ దీప్, కిల్లి కొట్టు యజమానిగా సందీప్. ఊర్లో ఉండే ఆకతాయిగా అర్జున్. అర్జున్ చెంచా గా ప్రశాంత్. గౌతమ్ శోభా వెంట తిరిగే రోమియో గా.. పూజా పల్లెటూరి అమ్మాయిగా చేసింది.
అటు జిలేబీ పురంలో సర్పంచ్ గా ప్రియాంక. జోతిష్కుడిగా భోలే , అశ్విని.. పల్లెటూరి అమ్మాయిగా అశ్విని. ఇక రెండు ఊర్లు పెద్ద మనిషిగా శివాజీ నటించారు. ఈ టాస్క్ చాలా ఫన్నీగా సాగింది. గులాబీ పురం బ్యాచ్ కంటే జిలేబీ పురం బ్యాచ్ బాగానే నవ్వించారు. ఆతర్వాత ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ .
ఒక రౌండ్ బోర్డు మీద ఒక్కొక్క గుడ్డును పట్టికెళ్లి యాక్టివిటీ రూమ్ లో ఉన్న పక్షి గూడు లో పెట్టాలి.అయితే ఆ గుడ్డు ఎక్కడ కిందపడకూడదు. గుడ్డును పట్టుకెళ్లే సమయంలో మధ్యలో తాళ్లు, టైర్లు, మెట్లు ఏర్పాటు చేశారు. ఒకొక్క టీమ్ నుంచి నలుగురు మాత్రమే ఆడాలి.. కొంత దూరం తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఉన్న మరో వ్యక్తికి ఆ బోర్డు ఇవ్వాలి. ఇలా ఎవరు ఎక్కువ గుడ్లు కలెక్ట్ చేస్తే వాళ్లే విన్నర్. గులాబీపురం టీమ్ తరఫున అమర్, గౌతమ్, యావర్, శోభా. జిలేబీపురం తరఫున అశ్విని, అర్జున్, సందీప్, ప్రశాంత్ ఈ గేమ్ ఆడారు. వీరిలోజిలేబీ పురం టీమ్ గెలిచింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.