Most Recent

Bhagavanth Kesari: గ్రౌండ్ ఫోర్ల్ బలిసిందా..? బాలయ్యకే మాస్ వార్నింగ్..!

Bhagavanth Kesari: గ్రౌండ్ ఫోర్ల్ బలిసిందా..? బాలయ్యకే మాస్ వార్నింగ్..!

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండతంతో ఈ మూవీ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఈ క్రమంలోనే భగవంత్ కేసరి సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ , శ్రీలీల తండ్రి కూతురుగా నటించి మెప్పించనున్నారు. నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వంశీ పైడిపల్లి, గోపీచంద్‌ మలినేని, బాబీ ముఖ్య అతిథులుగా  హాజరయ్యారు. ఇక బాలకృష్ణ తన స్పీచ్ తో అందరిని నవ్వించారు.

బాలయ్య మాట్లాడుతూ.. ఈ సినిమాలో శ్రీలీల చిచ్చా చిచ్చా అంటూ నన్ను టార్చర్ చేసింది అని అన్నారు. సినిమా మొత్తం చిచ్చా చిచ్చా అంటూ నన్ను ఇరిటేట్ చేసింది.. ఈ సినిమాలో కలిసి నటించాం నెక్స్ట్ సినిమాలో హీరో హీరోయిన్ గా చేద్దాం అని అన్నాను. ఇదే విషయాన్నీ ఇంటికి వెళ్లి నా భార్య కొడుకు మోక్షజ్ఞ తో కూడా చెప్పను. దాంతో మా వాడికి కోపం వచ్చింది. నాన్న నేను అప్ కమింగ్ యంగ్ హీరోని శ్రీలీలతో నువ్వు సినిమా చేస్తావా..? గ్రౌండ్ ఫోర్ల్ బలిసిందా..? అన్నాడు నన్ను అని చెప్పి అందరిని నవ్వించారు బాలయ్య.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.