ఈ వారం సినిమా సందడి గట్టిగానే ఉండనుంది. వారం వారం థియేటర్స్ లో కొత్త సినిమాలు హల్ చల్ చేస్తుంటే ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీల్లో సందడి చేస్తుంటాయి. ఇక ఈ వారం కూడా థియేటర్స్ లో బడా సినిమాలు రిలీజ్ కానున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా గురించే. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్ సినిమా సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో స్టార్ హీరోయిన్ నయనతార షారుక్ కు జోడిగా నటించారు. అలాగే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీలో షారుక్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. జవాన్ నుంచి విడుదలైన టీజర్స్, ట్రైలర్స్ సినిమా పై హైప్ ను పెంచేశాయి.
అలాగే యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా కూడా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి.
ఇక ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచినా జైలర్ సినిమా ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి రెడీ అవుతుంది. సెప్టెంబర్ 7 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది జైలర్.
ఇక ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్న సినిమాల లిస్ట్ విషయానికొస్తే..
నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, సిరీస్ లు.
1. షేన్ గిల్లీస్
2. స్కాట్స్ హానర్
3. కుంగ్‌ఫూ పాండా
4. టాప్ బాయ్
5. సెల్లింగ్ ది ఓసీ
6. వర్జిన్ రివర్
7. అమెజాన్ ప్రైమ్
8.వన్ షాట్
9.లక్కీ గౌ
10. సిట్టింగ్ ఇన్ బార్స్ విత్ కేక్
డిస్నీ+హాట్‌స్టార్
11. ఐ యామ్ గ్రూట్
ఆహా
12. లవ్
బుక్ మై షో
13.లవ్ ఆన్ ది రోడ్
లయన్స్ గేట్ ప్లే
14. ది బ్లాక్ డెమన్
ఆపిల్ టీవీ ప్లస్
15. ది ఛేంజ్‌లింగ్
హైరిచ్
ఉరు
సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ మూవీ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..