Most Recent

Shah Rukh Khan: ఆ విషయంలో చీప్‌గా ఉండొద్దు.. నెటిజన్‌కు కౌంటర్ ఇచ్చిన షారుఖ్

Shah Rukh Khan: ఆ విషయంలో చీప్‌గా ఉండొద్దు.. నెటిజన్‌కు కౌంటర్ ఇచ్చిన షారుఖ్

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ రీసెంట్ గా పఠాన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు. పఠాన్ సినిమాకు ముందు వరకు వరుస ఫ్లాప్ లను చవిచూశారు కింగ్ ఖాన్. దాంతో షారుఖ్ పని అయిపోయింది అన్న వారు కూడా ఉన్నారు. అదే టైంలో రిలీజ్ అయిన పఠాన్ సినిమా సంచలన విజయం సాధించింది. అంతే కాదు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఇక ఇప్పుడు జవాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు షారుఖ్. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమాలో నాయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అలాగే తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఆ అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఈ సినిమా సెప్టెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. అలాగే ఈ మూవీలో దీపికా పదుకొనె గెస్ట్ రోల్ కి కనిపించనుంది. ఇక ఈ మూవీ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ కోసం షారుఖ్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అభిమానులతో ముచ్చటించాడు షారుఖ్. ఈ క్రమంలో అభిమాను అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు.

 ఓ అభిమాని నా గర్ల్ ఫ్రెండ్ కోసం జవాన్ మూవీ టికెట్ ఫ్రీ గా ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. దానికి షారుఖ్ రిప్లే ఇస్తే.. ప్రేమ కావాలంటే ఉచితంగా దొరుకుతుంది.. కానీ టికెట్ ఫ్రీగా దొరకదు భాయ్. అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. టికెట్ కావాలంటే డబ్బులు ఇచ్చి కొనుక్కో బ్రదర్.. ప్రేమ విషయంలో అంత చీప్ గా ఉండొద్దు అంటూ బదులిచ్చాడు. టికెట్ కొనుక్కొని మీ గర్ల్ ఫ్రెండ్ ను సినిమాకు తీసుకెళ్లండి. అంటూ రిప్లే ఇచ్చారు షారుఖ్. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.