బిగ్ బాస్ సీజన్ 7 సందడి షురూ అయ్యింది. ప్రతిఏడాది లానే ఈ ఏడాది కూడా బిగ్ బాస్ గేమ్ షో ఘనంగా ప్రారంభం అయ్యింది. ఈ సీజన్ కు కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సారి బిగ్ బాస్ లోకి వెళ్లే కంటెస్టెంట్స్ విషయంలో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. నిన్నటి వరకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళేది వీరే అంటూ చాలా మంది పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కానీ కింగ్ నాగార్జున మాత్రం మొదటి రోజు 14 మందిని హౌస్ లోకి పంపించి అందరిని షాక్ కు గురి చేశారు. అయితే వెళ్లిన 14 మంది కాంటెస్ట్స్ కాదు అని అందులో కొంతమంది తిరిగి వెనక్కి వచ్చేస్తారని తెలిపారు. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లో ఆడి గెలిచినా వారే ఈ సీజన్ లోకి కంటెస్టెంట్స్ గా ఉంటారని తెలిపారు నాగార్జున. ఇక బిగ్ బాస్ సీజన్ 7 లో వెళ్లిన వారిలో ఉన్నది ఎవరంటే..
సీరియల్ ప్రియాంక జైన్, హీరో శివాజీ, సింగర్ దామిని భట్ల, మోడల్ ప్రిన్స్ యావర్, టీవీ నటి శుభశ్రీ, నటి షకీలా, టీవీ నటి శోభా శెట్టి,యూట్యూబర్ టేస్టీ తేజ, నటి రిథిక రోజ్ ,సీరియల్ హీరో డాక్టర్ గౌతమ్ కృష్ణ, యూట్యూబర్ పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి , నటి కిరణ్ రాథోడ్ లోకి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు.
అయితే వీరిలో చాలా మంది ప్రేక్షకులకు పెద్దగా తెలియని మొహాలే ఉన్నారు. వారిలో పల్లవి ప్రశాంత్ ఒకరు. ప్రశాంత్ ఒక యూట్యూబర్. సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ చాలా యాక్టివ్ గా ఉంటాడు. రైతు బిడ్డను అంటూ నెట్టింట బాగానే సందడి చేస్తుంటాడు. బిగ్ బాస్ గేమ్ షోకి వెళ్లాలని ఎప్పటి నుంచో సోషల్ మీడియా వేదికగా ఆయన రకరకాల పోస్ట్లు వీడియోలు షేర్ చేస్తున్నాడు.
View this post on Instagram
తనను బిగ్ బాస్ గేమ్ షోకు పంపాలని, అందుకు సపోర్ట్ చేయాలని జనాలను రిక్వెస్ట్ చేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు ఇప్పుడు అతడికి బిగ్ బాస్ నుంచి పిలుపు వచ్చింది. మరి బిగ్ బాస్ సీజన్ 7 లో పల్లవి ప్రశాంత్ ఎలా గేమ్ ఆడతాడో.. అక్కడుండే టాస్క్ లు,రాజకీయాలను ఎలా ఎదుర్కుంటాడో చూడాలి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..