Most Recent

Bigg Boss Season 7: అయిందిగా ఉల్టా పల్టా..! బిగ్ బాస్ దెబ్బకు అందరి మోహాలు మాడిపోయాయిగా.. దిమ్మతిరిగే ఎలిమినేషన్..

Bigg Boss Season 7: అయిందిగా ఉల్టా పల్టా..! బిగ్ బాస్ దెబ్బకు అందరి మోహాలు మాడిపోయాయిగా.. దిమ్మతిరిగే ఎలిమినేషన్..

తెలుగు టెలివిజన్ ఫీల్డ్‌లోనే బిగ్గెస్ట్ రియాల్టీ షోగా నామ్ కమాయించిన బిగ్ బాస్‌.. నిజంగా ఓ బ్యూటిపుల్ షో అంతే! ఎందుకంటే..! ఖాళీగా.. సఖ్యతగా ఉన్న కంటెస్టెంట్స్ మధ్య గొడవ పెట్టడం.. వాళ్లు కొట్టుకుంటూ ఉంటే.. మనల్ని వేడుక చూడడంటూ చెప్పడం..! ఇక అందులోనే మనము ఎంటర్‌టైన్మెంట్ వెతుక్కోవడం.. ఈ షో నిర్వాహకులేమో.. డబ్బులు వెతుక్కోవడం! అంతే.. బిగ్ బాస్‌కున్న బ్యూటీ ఇదే! అందుకే ప్రతీ వీకెండ్ టాస్కుల పేరుతో నాగార్జున.. నారధుడిగా మారి చేసేది ఇదే! ఒక్కో కంటెస్టెంట్‌ను పిలిచి నీ దృష్టిలో శత్రువెవరు.. వెన్నుపోటుదారుడెవరని గుచ్చి గుచ్చి మరీ అడిగి.. వారిలో వారికి గొడవలు పుట్టీయడమే.. అది కూడా నామినేషన్స్ ముందు చేయడమే సండే ఎపిసోడ్‌కున్న ప్రత్యేకతే..! ఎగ్జాక్ట్‌లీ.. ఈ సారి కూడా అంటే.. 14thడే 15th ఎపిసోడ్‌లో జరిగింది ఇదే..

ఎస్ ! వినాయకచవితిని గుర్తు చేస్తూ.. ఓ మాంచి బీట్ ఉన్న వినాయకుడి సాంగ్‌తో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నాగ్.. సినిమాల్లో కంటే.. చాలా ఎక్కవగానే స్టెప్పులేశారు. తన ఫ్యాన్స్‌ను అరిపించేస్తారు. పనిలో పనిగా టీఆర్పీ కోసమే ఈ రేంజ్‌లో కష్టపడుతున్నారేమో అనే డౌట్.. కొందర్లో అయిన కలిగేలా చేస్తారు.

ఇక షో మొదలు మొదలే కంటెస్టెంట్ అందరికీ బీబీ హౌస్ అంటూ.. టాస్క్‌ మొదలెట్టేసిన నాగ్.. ఆ టాస్క్‌లో భాగంగా.. కంటెస్టెంట్స్ అందరూ బాహుబలిలా మారుతారన్నారు. అలా మారిన ఒక్కొక్కరు కిరీటం ధరించి, కత్తిని పట్టుకుని.. తమకు కట్టప్ప ఎవరో అంటే.. వెన్నుపోటు పొడిచేది ఎవరో..! భళ్లాలదేవ ఎవరో అంటే.. శత్రువెవరో.. ఎంచుకుని.. వారిని కట్టప్ప, భళ్లాలదేవ కటౌట్‌ల వెను నిలబెట్టాల్సిందిగా చెబుతారు. ఇలా ఇన్‌డైరెక్ట్‌గా కాకుండా.. డైరెక్ట్‌గానే వారి మధ్య ఓ చిన్న పాటి గొడవను పెట్టే ప్లాన్ చేస్తారు. అలా మరుసటి రోజు జరిగే నామినేష్స్‌ను రక్తికట్టించేలా పథకం రచిస్తారు.

ఇక ఈ టాస్క్‌ను ముందుగా కార్తీక దీపం మోనిత అలియాస్ శోభతో స్టార్ట్ చేస్తారు నాగ్. తనకు కంటెస్టెంట్స్ అందరిలో కట్టప్ప ఎవరో .. భళ్లాలదేవ ఎవరో ఎంచుకోమంటారు. వారిని ఆ కటౌట్ వెనుక నిలపాలని చెబుతారు. తగిన రీజన్ కూడా చెప్పాలంటారు. ఇక అందుకు శోభ.. గౌతమ్‌ను వెన్నుపోటు పొడిచే కట్టప్పగా.. ప్రిన్స్‌ను శత్రువు భళ్లాలదేవగా ఎంచుకుంటుంది.

ఇక నెక్ట్స్ నాగ్ కాల్‌తో.. బాహుబలిగా మారిన గౌతమ్.. రతిక వెన్నుపోటు పొడిచే కట్టప్పగా.. ప్రిన్స్ యావర్ శత్రువు భళ్లాలదేవగా ఎంచుకుంటాడు. నెక్ట్స్‌ వచ్చిన రతిక.. తేజను కట్టప్పగా.. గౌతమ్‌ను భళ్లాలదేవగా ఎంచుకుంటుంది. ఆ తరువాత వచ్చిన తేజు.. గౌతమ్‌ను కట్టప్పగా.. శివాజీని భళ్లాలదేవా ఎంచుకంటాడు. ఇక శివాజీ ఏమో.. కట్టప్పగా తేజును.. భళ్లాలదేవగా రైతు బిడ్డను ఎంచుకుంటాడు. రైతు బిడ్డ ప్రశాంత్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టే తన శత్రువు అంటూ.. శివాజీ చెబుతారు. ప్రశాంత్ యాక్ట్ చేయడం లేదని.. వర్జినల్ అని… ఫేక్ కాదంటూ.. నాగ్ అడిగిన ప్రశ్నకు ఆన్సర్‌గా చెబుతాడు శివాజీ

అన్నా మళ్లొచ్చినా అంటూ.. బాహుబలిగా మారిన రైతు బిడ్డ.. తేజును కట్టప్పగా.. శివాజీని భళ్లాలదేవగా ఎంచుకుంటాడు. శివాజీనే ఎందుకు భళ్లాలదేవగా ఎంచుకున్నావ్ అని నాగ్ అడగగా.. తన తెలివిగా ఆడతారు కాబట్టి.. తనే నా కాంపిటీటర్ శత్రవు అంటూ చెబుతాడు ప్రశాంత్.

ఇక ఈ గేమ్‌కు కాస్త పాజ్‌ ఇచ్చిన నాగ్‌.. నామినేషన్లో ఉన్న వాళ్లలోంచి ఒకరిని.. ప్రిన్స్‌ యావర్‌ను సేఫ్ అని అనౌన్స్ చేస్తారు. తరువాత బాహుబలిగా మారిన స్టార్ సింగర్ దామిని.. కట్టప్పగా శోభను.. భళ్లాలదేవగా సందీప్‌ను ఎంచుకుంటుంది. ఇక ఫిజికల్‌గా స్ట్రాంగ్, మెంటల్‌గా స్ట్రాంగ్ కాబట్టే తన శత్రువు అంటూ రీజన్ చెప్పింది దామిని.

ఆ తరువాత వచ్చిన బాహుబలిగా మారిన సందీప్‌.. కట్టప్పగా శివాజీని.. భళ్లాలదేవగా తన పవరాస్త్ర కొట్టేసిన సుబ్బును ఎంచుకుంటాడు. కానీ ఈలోగా కింగ్ నాగ్.. ఓ చిన్న ప్రశ్నతో సందీప్‌ను తికమక పెట్టేస్తారు. పవరాస్త్ర టాస్క్లో ప్రిన్స్‌ను కాకుండా.. అమర్‌దీప్‌ను ఎందుకు ఎన్నుకున్నావ్‌ అంటూ.. ఇరుకున పెట్టేస్తారు నాగ్.

ఇక తరువాత వచ్చిన సుబ్బు.. కట్టప్పగా తేజును.. భళ్లాలదేవగా సందీప్‌ను ఎంచుకుంటుంది. ప్రియాంక తన శత్రువు భళ్లాలదేవగా సందీప్‌ను. కట్టప్పగా శివాజీని ఎంచుకుంటుంది. కట్టప్పకు వెన్నుపోటుకు.. తనను రక్షించడానికే తన వెనుక ఉంటూ మంచి మాటలు చెబుతున్నాడు శివన్న అందుకే కట్టప్ప శివన్నే అంటూ.. తికమక రీజన్ చెబుతుంది. ఆ రీజన్‌తో నాగ్ ను ఇంప్రెస్ చేస్తుంది ప్రియాంక. ఇక నెక్ట్స్ బాహుబలిగా మారిన ప్రిన్స్ సందీప్‌ను కట్టప్పగా.. శివాజీని భళ్లాలదేవగా ఎంచుకున్నారు. ఇక ఆ తరువాత వచ్చిన అమర్ కట్టప్పగా గౌతన్‌ను.. భళ్లాలదేవగా సందీప్‌ను కోట్ చేస్తాడు. షకీలా ఏమో.. రైతు బిడ్డ స్ట్రాంగ్ అని.. అందుకే తనకు శత్రువని చెప్పగా.. కట్టప్పగా ప్రిన్స్ ను ఎన్నుకుంటుంది. అందుకు రీజన్‌గా.. వీడొక్కడే కష్టపడ్డట్టు వీడి ఓవర్‌ యాక్షన్ ఎక్కువ చేశాడు. అందుకే ప్రిన్స్ తనకు కట్టప్ప అంటూ. షకీలా చెబుతారు. అయితే ఈ క్రమంలోనే నాగ్ మాట్లాడుతుండగా.. ప్రిన్స్ వినకుండా.. షకీలాతో వాదిస్తుండగా.. ఒక్కసారిగా నాగ్ సీరియస్ అయ్యారు. ప్రిన్స్ విను అంటూ.. గట్టిగా అరుస్తారు.

తరువాత స్టోర్‌ రూం నుంచి కొన్ని కీ బాక్సులను తెప్పించిన నాగ్.. గ్రీకలర్ కీ వస్తే.. సేఫ్ అని.. రెడ్ కలర్‌ కీ వస్తే.. అన్‌ సేఫ్ అంటారు. ఇక ఇంకా అన్‌ సేఫ్ అయిన కంటెంట్స్‌ అందరూ.. వారి వారి పేర్లున్న బాక్సులను ఒక్కొక్కరూ ఒపెన్ చేయగా.. గ్రీన్ కీ రావడంతో.. రతిక సేఫ్ అవుతుంది. దీంతో ఖుషీ అయిన రతిక ఒళ్లు దగ్గర పెట్టుకుని మరీ నాగ్‌కు .. బీబీ ఆడియెన్స్‌కు బోబుతుంది.

ఇక బీబీ బాహుబలి హౌస్ గేమ్ కంప్లీట్ అవడంతో.. మరో గేమ్‌ను మొదలెడతారు నాగ్. ఇందులో మహాబలి, రణధీర్ టీం పోటీపడాలని చెప్పి.. ఆట పేరు ‘కొంచెం గెస్ చేయ్‌ గురూ..’ అని చెబుతారు. స్కీన్ పై హీరో కస్ట్యూమ్ డిస్ ప్లే అవుతుందని.. ముందుగా గాంగ్ కొట్టిన వాళ్లు వెంటనే ఆ సినిమా పేరును కానీ.. హీరో పేరును కానీ గెస్ చేయాలని ఆట రూల్స్ చెబుతారు నాగ్. అయితే సరదాగా.. ఫన్ ఫుల్ గా సాగిన ఈ గేమ్‌లో .. రైతు బిడ్డ వెంట వెంటనే గాంగ్ కొట్టడం వల్ల.. త్వరగా హీరో పేరును గెస్ చేయడం వల్ల.. రణధీర్ టీం గెలుస్తుంది. ఇక ఈక్రమంలోనే టాస్క్‌ మధ్యలో ప్లే అయ్యే సాంగ్స్‌లో తేజు వేసిన డ్యాన్స్ అందర్నీ పొట్టచెక్కలయ్యేలా వవ్విస్తుంది. ఎంటటైనర్ అనే ట్యాగ్ ఈ సీజన్‌లో మనోడితే అని చూసిన వారందరికీ అనిపిస్తుంది.

ఇక ఈ సరదా గేమ్ మధ్యలో… ఎలిమినేష్స్‌లో ఉన్న మరో ఇద్దరిని సేఫ్ చేయాలనుకున్న నాగ్.. ఈ సారి అందుకు కాస్త డిఫరెంట్ రూట్ ఎంచుకున్నారు. ఓ బఫెల్లో క్యాప్‌ను కంటెస్టెంట్స్ టోపీగా ఒక్కొక్కరు పెట్టుకోమని.. అలా పెట్టుకున్నాక బఫెల్లో సౌండ్ వస్తే సేఫ్ అని.. డాంకీ సౌండ్ వస్తే వాళ్లు అన్ సేఫ్ అని చెబుతారు. అయితే ఇందులో బఫెల్లో సౌండ్‌ రావడంతో.. శోభ, రైతు బిడ్డ ప్రశాంత్ సేఫ్ అవుతారు.

ఇక ఈ తరువాత ‘కొంచెం గెస్ చేయ్‌ గురూ..’ గేమ్ ను కంటిన్యూ చేసిన నాగ్.. ఈ సారి పెయిర్స్‌ పెయిర్స్‌ గా కంటెస్టెంట్స్‌తో డ్యాన్స్ చేయిస్తారు. గౌతమ్‌, సుబ్బును కలిపి.. రతిక, రైతు బిడ్డను కలిపి డ్యాన్స్ చేయిస్తారు. ఇక అందులోనూ.. రవితేజ బ్రేకప్ ఫోక్ సాంగ్‌ ఆటలో భాగంగా ప్లే అవడంతో.. రైతు బిడ్డ కనెక్ట్ అయి దిమ్మతిరిగే రేంజ్‌ డ్యాన్స్ చేస్తాడు. అందర్నీ మరో సారి ఆకట్టుకుంటూనే.. రతిక లవ్‌ మ్యాటర్‌లో బానే ఫీలయినట్టున్నాడనే కామెంట్ వచ్చేలా చేసుకుంటాడు.

ఇక రైతు బిడ్డ దిమ్మతిరిగే పర్ఫార్మెన్స్ తర్వత కంప్లీట్ అయిన ఈ సరదా టాస్క్.. మరో సారి కంటెస్టెంట్ సేవ్ అయ్యే సీన్‌లోకి వెళుతుంది. ఇక ఈసారి తన చేతిలో ఉన్న బాక్స్‌లో రెడ్ రావడంతో.. డాక్టర్ గౌడమ్‌ సేఫ్ అవుతాడు. షకీలా.. తేజు ఇంకా అన్‌సేఫ్‌ గానే ఉంటారు.

ఇక అన్‌సేఫ్ గా మిగిలిన తేజు, షకీలా ఇద్దరినీ.. యాక్టివిటీ రూమ్‌కు వెళ్లమని చెప్పిన నాగ్.. మాయాపేటిక మీదున్న బాక్స్‌ను ఓకే సారి పుల్ చేయమనగా.. తేజు ఫోటో మయాపేటిక నుంచి వస్తుంది. దీంతో తేజు సేఫ్.. షకీలా అన్‌సేఫ్ అని అనౌన్స్ చేస్తారు కింగ్ నాగార్జున. ఇక తరువాత కంటెస్టెంట్స్ అందరి ఏడుపులు… బాధల మధ్య.. తేజు వెక్కి వెక్కి ఏడుపుల మధ్య .. బిగ్ బాస్ స్టేజ్ మీదికి వెళతారు షకీలా..! కానీ తను వెళ్లాక.. ప్రిన్స్, సందీప్, అమర్‌ కలిసికట్టుగా.. సిగరెట్ తాగూతూ మరీ ఏడుస్తారు.

ఇక నాగ్ దగ్గరికి వచ్చిన షకీలా.. బిగ్ బాస్ చూపించిన తన జెర్నీ వీడియోను చూసి కాస్త ఎమోషనల్ అవుతారు. ఎప్పటిలానే.. ఫైనల్‌గా.. నాగ్ తనకిచ్చిన టాస్కలో భాగంగా.. కంటెస్టెంట్స్ రంగును బయటపెడతారు. బిగ్ బాస్ అప్పటికే ఇంద్రధనస్సులోని రంగులకు.. కొన్ని క్వాలిటీస్‌ ఇవ్వగా.. ఎవరికి ఏయే రంగు..ఇస్తారో.. ఆయా క్వాలిటీ ఉన్నట్టు అంటూ నాగ్ చెబుతారు. ఇక ప్రెండ్లీ నీలం రంగును ప్రియాంకకు షకీలా ఇవ్వగా.. తనే గొప్ప ఆరెంజ్‌ రంగును ప్రిన్స్‌కు ఫోటోకు పూస్తారు. ఆవేశ పరులు.. రెడ్ కలర్‌ను రైతు బిడ్డకు ఇస్తారు షకీలా. ఇక నమ్మకస్తులుగా దామినిని, స్టోన్ హార్ట్‌ రతికదని, ఆనందం పంచేది శివాజీ అని చెబుతారు. ఇక చివరగా తేజు షకీలాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. షకీలా తన అమ్మ ఫరెవర్ అంటూ ఎమోషనల్ అవుతాడు. ఆ తరువాత దామిని.. ‘పెదవే పలికిన మాట అంటూ.. నాని సినిమాలోని అమ్మ పాట పాడుతుండగా.. షకీలా ఒక్కసారిగా ఏడ్చేస్తారు. ఇక చివర్లో.. చలేసినా.. ఇంకేదైనా ఎవరికి కేటాయించిన బెడ్ రూమ్స్‌లో వాళ్లే పడుకోవాలంటూ.. మరో రూల్ పాస్ చేసి.. ఎప్పటిలానే బిగ్ బాస్ ఇంటి మీద కూడా కన్నేసి ఉంంచండి అంటూ.. షోను ముగించేస్తారు.

                                                                                                              – సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.