బిగ్ బాస్ సీజన్ 7 ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గత సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ మరింత రసవత్తరంగా సాగుతుంది. సీజన్ 7 ఉల్టా పల్టా గా ఉంటుందని చెప్పిన కింగ్ నాగార్జున. అందుకు తగ్గట్టుగానే హౌస్ లో ఉన్నవారితో గేమ్స్ ఆడిస్తూ అలరిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ 7 రెండు వారాలు పూర్తి చేసుకుంది. హౌస్ లోకి ముందుగా 14 మందిని పంపించారు. అందులో నుంచి మొదటి వారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాగా ఈ వారం హౌస్ నుంచి షకీలా ఎలిమినేట్ అయ్యారు. ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున హౌస్ లో ఉన్న వారితో గేమ్స్ ఆడించి అలరించారు. భల్లాలదేవు, కట్టప్ప అంటూ హౌస్ లో ఉన్న వారితో గేమ్ ఆడించాడు కింగ్ నాగార్జున. బాహుబలి కత్తి, కిరీటం పెట్టుకొని హౌస్ లో ఉన్నవారిలో భల్లాలదేవ ఎవరు .? కట్టప్ప ఎవరు చెప్పమని అన్నారు నాగ్.
దాంతో ఒకొక్కరు బాహుబలిగా మారి తమ శత్రువు(భల్లాలదేవ), వెన్నుపోటు దారుడు (కట్టప్ప) ఎవరో ఎందుకో చెప్పారు. ఈ క్రమంలో ప్రిన్స్ యవార్ పై కింగ్ నాగార్జున సీరియస్ అయ్యారు. మనోడు మొదటి నుంచి నేనెక్కడినే ఆడుతున్నా.. అయినా కూడా నన్ను పట్టించుకోవడం లేదు.. టార్గెట్ చేస్తున్నారు అంటూ తెగ ఫీల్ అయిపోతున్నాడు.
ఈ క్రమంలోనే నాగార్జున ఇచ్చిన టాస్క్ లో తనలో ఉన్న డౌట్స్ మొత్తం అడిగేశాడు నాగ్ కూడా చాలా ఓపికగా సమాదానాలు చెప్పారు. అలాగే యావర్ ను సపోర్ట్ చేస్తూ మాట్లాడారు కూడా.. షకీలా బాహుబలిగా మారి ప్రశాంత్ ను భల్లాలదేవ అని చెప్పి ప్రిన్స్ ను కట్టప్ప అని చెప్పింది. దానికి కారణం కూడా చెప్పారు. ప్రిన్స్ మాయాస్త్ర టాస్క్ లో నేనొక్కడినే ఆడాను. ఇంకెవ్వరూ ఆడలేదు అని అనుకుంటున్నాడు. అలాగే నేనే రెండో పవర్ అస్త్రకు అర్హుడిని అని అనుకుంటున్నాడు అని తెలిపింది. దానికి యావర్ వాదించే ప్రయత్నం చేశాడు. అవును నేను బాగా ఆడాను. నేనే అర్హుడిని అనుకుంటే తప్పేంటి అంటూ గట్టిగా మాట్లాడాడు. దానికి నాగార్జున మాట్లాడుతూ.. టీమ్ గా ఉన్నప్పుడు అందరూ ఆడాలి యావర్. ఒక్కడే ఆడితే టీమ్ గెలవదు ఎవరి ఎఫర్ట్స్ వాళ్లు పెట్టి ఆడారు. నువ్వొక్కడివే డిజర్వ్ అని అనుకుంటే ఎలా.. అని నాగ్ చెప్తుండగానే మరోసారి నాగ్ తో వాదించే ప్రయత్నం చేశాడు. దాంతో నాగార్జునకు చిర్రెత్తుకొచ్చింది. ఆగు యావర్.. మాట్లాడుతున్నా కదా విను.. ఆగు అంటూ కాస్త బేస్ వాయిస్ తో చెప్పాడు. ఆతర్వాత కూడా యావర్ ఎదో చెప్పాలని చేయి పైకి ఎత్తినా కూడా కూడా నాగ్ పట్టించుకోకుండా .. ఎలిమినేషన్ ప్రక్రియను మొదలు పెట్టాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.