Most Recent

Chandramukhi 2: మరోసారి భయపెట్టడానికి రెడీ అయిన చంద్రముఖి.. ట్రైలర్ వచ్చేసింది

Chandramukhi 2: మరోసారి భయపెట్టడానికి రెడీ అయిన చంద్రముఖి.. ట్రైలర్ వచ్చేసింది

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో చంద్రముఖి సినిమా ఒకటి. దాదాపు 17 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతకు ముందు ఈ సినిమా కన్నడ భాషలోనూ తెరకెక్కింది. ఇక తమిళ్ లో  సూపర్ స్టార్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు భాషలోనూ రిలీజ్ అయ్యింది. రెండు భాషల్లోనూ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో జోతిక అద్భుతంగా నటించి మెప్పించారు. జోతిక నటన ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా చంద్రముఖి 2 రాబోతుంది. చంద్రముఖి సినిమాకు దర్శకత్వం వహించిన ఫై వాసు ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో చంద్రముఖిగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ నటిస్తున్నారు. అలాగే హీరోగా రాఘవలారెన్స్ నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమానుంచి టీజర్, పోస్టర్స్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. చంద్రముఖి 2 ట్రైలర్ ఎలా ఉందంటే.. ఈ మూవీ ట్రైలర్ పాత చంద్రముఖి సినిమాను గుర్తు చేసింది. అదే బంగ్లాలోకి 17 ఏళ్ల వచ్చిన ఓ ఫ్యామిలీ. ఆ తర్వాత హీరో ఎంట్రీ.. చంద్రముఖి గది.. ఆమె డాన్స్ ఇలా ట్రైలర్ లో చూపించారు. అలాగే ట్రైలర్ బిగినింగ్ లో ఓ పెద్ద పామును చూపించారు

స్టార్ కమెడియన్ వడివేలు మరోసారి ఈ సినిమాలో తన కామెడీతో ఆకట్టుకోనున్నారు. నాంతాండ చంద్రముఖి అంటూ చివరిలో కంగనా భయపెట్టేలా డైలాగ్ చెప్పి ఆసక్తిని పెంచారు. ఈ ట్రైలర్ మొత్తానికి కంగనా హైలైట్ గా నిలిచింది. చంద్రముఖి గా ఆమె చాలా అందంగా కనిపించింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా భయపెడుతుందో చూడాలి. సెప్టెంబర్ 15న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఆస్కార్ విజేత కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రాధిక శరత్ కుమార్, లక్ష్మీ మీనన్ ఈ మూవీలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు .

కంగనా రనౌత్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by Kangana Ranaut (@kanganaranaut)

అలాగే ఈ సినిమాలో రాఘవ లారెన్స్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపించనున్నారు. వేటాయ అనే రాజు పాత్రలోనూ కనిపించనున్నారు లారెన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.