
చాలా రోజులుగా అభిమానులకు ప్రభాస్ ఓ భారీ హిట్ బాకీ ఉన్నారు.. అందులో ఎలాంటి ఇష్యూ లేదు.. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా ఆ బాకీ తీరుస్తారు. కానీ ఇదొక్కటే కాదు.. మరొకరికి కూడా ప్రభాస్ బాకీ ఉన్నారు. ప్రతీసారి ప్రభాస్‌ను కావాలనే గిల్లుతున్నారాయన. అతడికి మాటలతో కాదు.. హిట్‌తో సమాధానం చెప్పాలని చూస్తున్నారు రెబల్ స్టార్. మరి ప్రభాస్‌ను అంతగా ఇరిటేట్ చేస్తున్నదెవరు..? ఆ బాకీ ఏంటి..? అక్కడ పాటలో రజినీకాంత్ క్రేజ్‌ను ప్రభాస్ ఎలా సెలెబ్రేట్ చేసుకుంటున్నారో.. ఇప్పుడు ప్రభాస్‌ను కూడా అలాగే సెలెబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. పాన్ ఇండియన్ వైడ్‌గా రెబల్ స్టార్‌కు అదిరిపోయే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందిప్పుడు. ఈయన సినిమాలకు పోటీగా రావడానికి ఒకటికి 10 సార్లు ఆలోచిస్తున్నారు మేకర్స్.
కానీ బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మాత్రం కోరి మరీ ప్రతీసారి ప్రభాస్‌నే టార్గెట్ చేస్తున్నారు. గతేడాది చిన్న సినిమాగా విడుదలై 250 కోట్లకు పైగా వసూలు చేసిన కాశ్మీర్ ఫైల్స్ దర్శకుడే వివేక్ అగ్నిహోత్రి. 2022 మార్చ్ 11 అంటే.. రాధే శ్యామ్ విడుదలైన రోజే ఇది కూడా వచ్చింది. ఓపెనింగ్స్ రాధే శ్యామ్‌కు వచ్చినా.. ఆ తర్వాత మాత్రం కాశ్మీర్ ఫైల్స్ ఆధిపత్యం చెలాయించింది. ఇప్పుడు సలార్‌కు పోటీగా.. తన వాక్సిన్ వార్ తీసుకొస్తున్నారు వివేక్. తాజాగా మరోసారి ఇదే విషయం కన్ఫర్మ్ చేసారీయన. సలార్‌పై ఉన్న అంచనాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కానీ అదొస్తున్న సెప్టెంబర్ 28నే వివేక్ అగ్రిహోత్రి వాక్సిన్ వార్ వస్తుంది. ఆ మధ్య ఆదిపురుష్‌పైనా అనుచిత వ్యాఖ్యలు చేసారు వివేక్.
View this post on Instagram
ఎవర్ని పడితే వాళ్లను దేవుడంటే నమ్మడానికి ప్రజలు మూర్ఖులు కారంటూ కామెంట్ చేసి.. తర్వాత సారీ అన్నారు. ఈయన తీరు చూస్తుంటే ప్రభాస్‌ను కావాలనే టార్గెట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. వివేక్ అగ్నిహోత్రి తీరు ఎలా ఉన్నా.. ప్రభాస్ మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. ఈయనకు మాటలతో కాదు.. సలార్ విజయంతోనే సమాధానం చెప్పాలని చూస్తున్నారు. వివేక్ ఒక్కడే కాదు.. చాలా మందికి ప్రభాస్ తన హిట్‌తోనే ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు. చూడాలిక.. ఏం జరగుతుందో..?
View this post on Instagram
ప్రభాస్ ఇన్ స్టా గ్రామ్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.