
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాలను అందుకున్న సినిమా బేబీ. సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. యువతను కట్టిపడేసే కథతో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో విరాజ్ అశ్విన్ మరో హీరోగా నటించాడు. ఈ సినిమాలో ఆనంద్, వైష్ణవి తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాకు ఇప్పటికి కూడా కలెక్షన్స్ వర్షం కురుస్తుంది. జులై 14న విడుదలైన ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. బేబీ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో సినిమా రిలీజ్ అయిన కూడా ఈ కలెక్షన్స్ మాత్రం భారీగా వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా కథ ముందుగా ఓ యంగ్ హీరోకు చెప్తే ఆయన రిజక్ట్ చేశారని దర్శకుడు సాయి రాజేష్ చేసిన కామెంట్స్ అప్పడు వైరల్ అయిన విషయం తెలిసిందే..
సినిమా కథ చెప్పడానికి వెళ్తే గంటల సేపు వెయిట్ చేయించుకొని కథ కూడా వినకుండా పంపించేశారని ఆవేదన వ్యక్తం చేశాడు సాయి రాజేష్. ఆ సమయంలో చాలా బాధ అనిపించిందని.. ఆయన నో చెప్పిన విధానం తనకు నచ్చలేదని తెలిపాడు సాయి రాజేష్. ఇక బేబీ సినిమా భారీ విజయం అందుకోవడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేశారు. అయితే ఈ ఈవెంట్ కు హాజరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇదే ప్రస్తావన తీసుకొచ్చారు. ఓ హీరో దగ్గరకు వెళ్లి కథ చెప్తానంటే వినకుండా పంపించేయడం.. గంటలు గంటలు కూర్చోబెట్టడం కరెక్ట్ కాదని అయినా కూడా పట్టువదలకుండా.. నిరాశపడకుండా సాయి రాజేష్ కథను నమ్మి సక్సెస్ అయ్యాడని ప్రశంసించారు అల్లు అర్జున్
దాంతో ఆ బేబీ మూవీని రిజక్ట్ చేసింది విశ్వక్ సేన్ కొన్ని ట్రోల్స్ వచ్చాయి. దాంతో విశ్వక్ బయటకొచ్చి నేను కథ వినలేదు అంటే వేరే వాటిలో బిజీ గా ఉన్నా.. కొన్నిసార్లు నో చెప్పాల్సి వస్తుందని చెప్పుకొచ్చాడు. విశ్వక్ మాటలకూ కౌంటర్ ఇచ్చాడు దర్శకుడు సాయి రాజేష్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. విశ్వక్ కు బేబీ కథ చెప్పిన విషయం నిజమే.. కానీ ఆయన నో చెప్పిన విధానం నాకు నచ్చలేదు. బహుశా ఆయన స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో నేను లేనేమో..ఆ హిట్‌ని ఎంజాయ్ చేయాలి కానీ ఎదుటివారిని అవమానించొద్దని విశ్వక్ సేన్ అనేసరికి చాలా బాధపడ్డా అన్నాడు. కథ నచ్చకపోయినా నో చెప్పే విధానం మంచిగుండాలి.. కానీ దురుసుగా ఉండకూడదు. విశ్వక్ పై నాకు ఎలాంటి కోపం లేదు.. నేను ఎక్కడా కూడా బేబీని రిజక్ట్ చేసింది విశ్వక్ సేన్ అని ఆయన పేరును చెప్పలేదు అని తెలిపాడు.