Most Recent

Tollywood: సౌత్ వర్సెస్ నార్త్.. పోటా పోటీగా రికార్డ్స్ బ్రేక్ చేస్తోన్న చిత్రాలు..

Tollywood: సౌత్ వర్సెస్ నార్త్.. పోటా పోటీగా రికార్డ్స్ బ్రేక్ చేస్తోన్న చిత్రాలు..

ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈ పాట ఇప్పుడు బాలీవుడ్‌కు బాగా సూట్ అవుతుంది. ఒక్కటా రెండా.. దాదాపు మూడేళ్లుగా ఇలాంటి రోజుల కోసమే కదా వాళ్లు వెయిట్ చేస్తున్నది. ఇన్నాళ్లకు వాళ్ల కోరిక నెరవేరింది. మేం ఫామ్‌లోకి వచ్చేసాం అంటూ వాళ్లు కాలర్ ఎగేరేస్తున్నారు.. బ్యాక్ ఆన్ ట్రాక్ అంటూ విజిల్స్ వేస్తున్నారు. కానీ వాళ్లకు తెలియదు ఇన్‌ఫ్రంట్ దేర్ ఈజ్ క్రోకోడైల్ ఫెస్టివల్ అని. మరి ఏంటా ఫెస్టివల్..? చాలా ఏళ్ళ తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతుంది. ఒకప్పట్లా మళ్లీ వాళ్ల సినిమాలు కలెక్షన్ల సునామీ కురిపిస్తున్నాయి. 2023 మొదట్లోనే పఠాన్ ఏకంగా 1000 కోట్లు వసూలు చేయడంతో.. మాకు మంచి రోజులు వచ్చాయి.. మా పొలంలో మొలకలొచ్చాయంటూ గంతేసారు. కానీ పఠాన్ తర్వాత ఏ సినిమా వర్కవుట్ అవ్వలేదు.. మధ్యలో కేరళ స్టోరీ మాత్రమే బ్లాక్‌బస్టర్ అయింది.

2023లో పఠాన్, కేరళ స్టోరీ, తూ జూటీ మై మక్కర్, రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ ఓకే అనిపించాయి. ఫస్టాఫ్ జస్ట్ ఓకే అనిపించినా.. సెకండాఫ్ మాత్రం సాలిడ్‌గా మొదలైంది. ఎవరూ ఊహించని స్థాయిలో ఫేడవుట్ హీరో సన్నీ డియోల్ గదర్ 2తో చరిత్ర సృష్టిస్తున్నారు. ఈ చిత్రం కేవలం 5 రోజుల్లోనే 230 కోట్లు వసూలు చేసింది.. అలాగే అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 కూడా 5 రోజుల్లో 80 కోట్లు తీసుకొచ్చింది.

షారుఖ్ ఖాన్ ఇన్ స్టా పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by Shah Rukh Khan (@iamsrk)

సెప్టెంబర్ 7న జవాన్ ఉంది.. అది హిట్టైతే 1000 కోట్లు ఖాయం. దాని తర్వాత యానిమల్, టైగర్ 3 కూడా ఇదే ఏడాది రానున్నాయి. వీటిని చూసుకుని బాలీవుడ్ కాలర్ ఎగరేస్తుంది. అయితే సలార్ సెప్టెంబర్ 28న రాబోతుంది. అలాగే పుష్ప 2, గేమ్ ఛేంజర్, దేవర లాంటి సినిమాలు పాన్ ఇండియన్ దండయాత్రకు సిద్ధమవుతున్నాయి. ఇవి కానీ కరెక్టుగా వర్కవుట్ అయితే.. నార్త్ ఇండస్ట్రీకి మళ్లీ చెమటలు తప్పవు.

రణ్వీర్ సింగ్ ఇన్ స్టా పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh)

సన్నీ డియోల్ ఇన్ స్టా పోస్ట్..

 

View this post on Instagram

 

A post shared by Zee Studios (@zeestudiosofficial)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.