
అందాల భామ సినిమాలతో పాటు సోషల్ మీడియాతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ అందాలు ఆరబోస్తూ కవ్విస్తున్నారు. చాల మంది హీరోయిన్స్ కు సినిమాల్లో క్రెడిట్ రావడం కష్టమే. ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా క్రెడిట్ హీరోల ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఇంకొన్ని సినిమాల్లో హీరోయిన్స్ కేవలం పాటలకే పరిమితం అవుతూ ఉంటారు. దాంతో ఈ ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ లిస్ట్ లో ఉన్న ముద్దుగుమ్మలు ఎవరో తెలుసా..?
కేతిక శర్మ.. ఈ చిన్నది రొమాంటిక్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే అందంతో ఆకట్టుకుంది. రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది ఈ భామ. వరుసగా సినిమాలు చేస్తున్నా సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది ఈ భామ. రీసెంట్ గా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాతో హిట్ అందుకుంది.
View this post on Instagram
ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది పాయల్ రాజ్ పుత్. తొలి సినిమాలోనే ఈ అమ్మడు రొమాంటిక్ సీన్స్ తో అదరగోటింది. ఇన్ టెన్స్ సీన్స్ లో రెచ్చిపోయి నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు వరుస సినిమాల్లో నటిస్తుంది. త్వరలోనే మంగళవారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.
View this post on Instagram
హీరోయిన్ గా కంటే స్పెషల్ సాంగ్స్ తోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంది లక్ష్మీ రాయ్. ఈ బ్యూటీ అందాలకు ఫిదా కానీ కుర్రాడు ఉండరు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ మెప్పించింది ఈ చిన్నది. ఇక ఈ అమ్మడు హాట్ ఫోటోలకు పెట్టింది పేరు. నిత్యం సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు షేర్ చేసి ఆకట్టుకుంటుంది.
View this post on Instagram
తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది అమలాపాల్. లవ్ ఫెలియర్ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. వరుస సినిమాతో దూసుకుపోతున్న అమలాపాల్. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ ఆకట్టుకుంది అమలాపాల్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.