టాలీవుడ్ లో కొత్త అందాలకు కొదవే లేదు. ఇప్పటికే చాలా మంది కొత్త హీరోయిన్స్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సొంతం చేసుకుంటున్నారు. ఆ లిస్ట్ లో మొదటి వరసలో ఉంది లేటెస్ట్ సెన్సేషనల్ శ్రీలీల. దర్శకేద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందD సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. కన్నడ ఇండస్ట్రీలో సినిమాలు చేసిన శ్రీలీల తెలుగులో హీరోయిన్ గా రాణిస్తుంది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న శ్రీలీల. ఆతర్వాత మాస్ మహారాజా రవితేజ సరసన నటించే ఛాన్స్ అందుకుంది. ధమాకా సినిమాలో రవితేజ సరసన నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.
ప్రస్తుతం శ్రీలీల చేతిలో 10కి పైగా సినిమాలున్నాయి. మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది శ్రీలీల. ఈ సినిమాలో ముందుగా పూజాహెగ్డేను హీరోయిన్ గా అనుకున్నప్పటికీ ఆమె తప్పుకోవడంతో శ్రీలీలకు మెయిన్ హీరోయిన్ ఛాన్స్ దక్కింది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
View this post on Instagram
అలాగే నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో నటిస్తుంది శ్రీలీల. అలాగే రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న స్కంద, పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలలో నటిస్తుంది. ఇలా ఈ అమ్మడి ఖాతాలో చాలా సినిమాలు ఉన్నాయి.
View this post on Instagram
ఇదిలా ఉంటే ధమాకా సినిమాలో రవితేజకు పోటీ పడుతూ తన ఎనర్జీతో కట్టిపడేసింది శ్రీలీల. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ కానుందని తెలుస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుందని తెలుస్తోంది. అలాగే శ్రుతిహాసన్ కీలక పాత్రలో నటిస్తుందని టాక్. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..