-
చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న సినిమాల్లో కాంతారా మూవీ ఒకటి. ఈ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది హీరోయిన్ సప్తమి గౌడ. ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది సప్తమి గౌడ.
-
కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణిస్తుంది సప్తమి గౌడ. 2020లో వచ్చిన పాప్కార్న్ మంకీ టైగర్ అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సప్తమి గౌడ. తొలి సినిమాతోనే నటనతో ఆకట్టుకొని. విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
-
ఆతర్వాత 2022లో వచ్చిన కాంతారా సినిమాతో మంచి అందుకుంది. ఈ సినిమాతో ఈ అమ్మడికి మంచి క్రేజ్ వచ్చింది. దాంతో అవకాశాలు కూడా భారీగానే వస్తున్నాయి. ఇక ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. హిందీలో ఓ క్రేజీ మూవీలో నటిస్తుంది సప్తమి.
-
వ్యాక్సిన్ వార్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది సప్తమి గౌడ. అలాగే టాలీవుడ్ లోకి కూడా ఈ అమ్మడు ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు అనే సినిమాలో హీరోయిన్ గా సప్తమిని ఎంచుకున్నారని టాక్.
-
ఇక సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా బ్లాక్ కలర్ చీరలో వయ్యారంగా ఫోటోలకు ఫోజులిచ్చింది సప్తమి గౌడ