Most Recent

Anupama Parameswaran: ఓనమ్ పాటతో మైమరపించిన అనుపమ.. ఎంత ముద్దుగా పాడిందో చూశారా ?..

Anupama Parameswaran: ఓనమ్ పాటతో మైమరపించిన అనుపమ.. ఎంత ముద్దుగా పాడిందో చూశారా ?..

మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం డీజే టిల్లు 2 చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సిద్ధూ జొన్నలగడ్డ నటిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకులలో క్యూరియాసిటి నెలకొంది. గతంలో డీజే టిల్లు సినిమాతో ఆకట్టుకున్న సిద్ధూ.. ఇప్పుడు వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో చూడాలని అడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో అందాల అనుపమ భాగమవ్వడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఆక్టటుకున్నాయి. ఇటు తెలుగులోనే కాకుండా.. తమిళ్, మలయాళంలోనూ పలు చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది అనుపమ. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న అనుపమ అటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్ చేయడమే కాకుండా ఫాలోవర్లతో చిట్ చాట్ చేస్తుంది. ఇక మంగళవారం ఓనమ్ పండగ కావడంతో సంప్రదాయ చీరకట్టులో కనిపించి మంత్రముగ్దులను చేసింది ఈ కేరళ కట్టి.

ఓనమ్.. కేరళలో మలయాళీ వాళ్లు చేసుకునే పెద్ద పండగలలో ఒకటి. ఆ రోజున కేరళ లేడీస్ అంతా తెలుపు, పట్టు అంచు ఉన్న కసవు చీరల్లో కనిపిస్తారు. ఇక ఈ పండగ రోజున సినీతారలు అంతా సంప్రదాయ దుస్తులలో ఇంట్లో జరుపుకున్న ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు… ఈ క్రమంలోనే తాజాగా అనుపమ సైతం తన ఇన్ స్టా ఖాతాలో కొన్ని అందమైన ఫోటోస్ షేర్ చేసింది. అలాగే ఓనమ్ స్పెషల్ వీడియోను పంచుకుంది.

ఆ వీడియోలో అనుపమ.. ఇంటి బయట కూర్చొని మలయాళంలో ఓనమ్ పాట అందంగా పాడింది. రింగు రింగుల జుట్టు.. పట్టు అంచు ఉన్న తెలుపు కసవు శారీ కట్టుకుని ఎంతో అందంగా కనిపిస్తూ… చాలా క్యూట్‏గా ఓనమ్ సాంగ్ పాడిన వీడియోను షేర్ చేస్తూ అందరికీ ఓనమ్ శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా..ఎంత ముద్దుగా పాడింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించిన అనుపమకు ఇప్పటివరకు స్టార్ హీరోస్ సినిమాల్లో మాత్రం ఛాన్స్ రాలేదు. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు దొచేసిన ఈ చిన్నది.. టాలీవుడ్ అగ్రకథానాయకుల సినిమాల్లో కనిపించలేదు. ప్రస్తుతం డీజే టిల్లు 2 సినిమాలో గ్లామర్ రోల్ చేసేందుకు సిద్ధమయ్యింది ఈ కేరళ కుట్టి. గతేడాది కార్తికేయ, 18 పేజిస్ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది అనుపమ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.