Most Recent

Kushi: ఫుల్ జోష్‌లో ఖుషి మూవీ ప్రమోషన్స్.. హిట్ గ్యారెంటీ అంటున్న ఫ్యాన్స్

Kushi: ఫుల్ జోష్‌లో ఖుషి మూవీ ప్రమోషన్స్.. హిట్ గ్యారెంటీ అంటున్న ఫ్యాన్స్

మైనస్ మైనస్ కలిస్తే ప్లస్ అవుతుందని చిన్నపుడు లెక్కల్లో చదువుకున్నాం కదా.. ఇక్కడ ఒకటి కాదు నాలుగు మైనస్‌లు ఉన్నాయి.. అంటే దెబ్బకు డబుల్ ప్లస్ అవ్వాలన్నమాట. అలాంటి రిజల్ట్ కోసమే వేచి చూస్తున్నారిప్పుడు ఓ టీం. ఎందుకంటే ఒక్క సినిమా.. నలుగురికి లిట్మస్ టెస్ట్ పెట్టింది కాబట్టి. మరి ఏంటా సినిమా..? దానికి ముందు వాళ్లకున్న ఫ్లాపులేంటి..? ఖుషి.. నిన్నటి వరకు ఈ సినిమాపై టాక్ ఎలా ఉన్నా.. ఒక్క ఈవెంట్‌తోనే మొత్తం మార్చేసారు విజయ్ దేవరకొండ.

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

దెబ్బకు ఈ సినిమాపై ఇంత క్రేజ్ ఉందా అనేలా ఈ చిత్ర మ్యూజికల్ ఈవెంట్ జరిగింది. వేలాది మంది అభిమానులు ఈ వేడుక చూడ్డానికి ఎగబడ్డారు. ఇక విజయ్, సమంత డాన్స్ ఈ ఈవెంట్‌కు హైలైట్‌గా నిలిచింది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

ఆరోగ్యం బాగోలేకపోయినా.. స్యామ్ మ్యూజికల్ ఈవెంట్ అంతా ఉత్సాహంగా కనిపించారు. విజయ్ దేవరకొండ సైతం ఫుల్ జోష్‌లో కనిపించారు. సెప్టెంబర్ 1న బ్లాక్‌బస్టర్‌తో కలుస్తున్నాం అంటూ చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడారు రౌడీ హీరో. అయితే ఖుషీ అందరికీ లిట్మస్ టెస్ట్‌లా మారిందిప్పుడు.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

ఎందుకంటే ఇటు విజయ్ దేవరకొండ.. అటు సమంత.. మరోవైపు దర్శకుడు శివ నిర్వాణ.. ఇంకోవైపు మైత్రి మూవీ మేకర్స్ అందరి ముందు సినిమాలు నిరాశ పరిచాయి.. దాంతో ఖుషీ అందరికీ కీలకమే. టాక్సీ వాలా తర్వాత విజయ్‌కు హిట్ లేదు. డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ అన్నీ ఫ్లాపులే. అయినా విజయ్ మార్కెట్ మాత్రం అలాగే ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

ఖుషి హిట్టైతే అంతా సెట్టైపోతుంది. అలాగే శాకుంతలంతో స్యామ్ ఫ్లాపిచ్చారు. మైత్రి మూవీ మేకర్స్ సైతం అమిగోస్, మీటర్ సినిమాలతో ఫ్లాప్స్ ఇచ్చారు. శివ నిర్వాణ ముందు సినిమా టక్ జగదీష్ నిరాశ పరిచింది. ఇలా అందరికీ ఖుషీ అత్యంత కీలకంగా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.