Most Recent

Kamal Haasan: సీరియస్ అయిన కమల్ హాసన్.. ఎందుకంటే ??

Kamal Haasan: సీరియస్ అయిన కమల్ హాసన్.. ఎందుకంటే ??

ప్రభాస్! పాన్ ఇండియన్ హీరోగా స్టార్ డమ్ సొంతం చేసుకున్నా కూడా.. పది మందిలో మాట్లాడలేని తన తీరును ఇంకా.. మార్చుకోలేక పోతున్నారు . భారీ సినిమాలు ఒప్పుకుంటున్నా.. అందులో తన పర్ఫార్మెన్స్‌తో బాక్సాఫీస్ బద్దలు కొడుతున్నా కూడా.. తనకున్న ఇంట్రావర్ట్ అనే ట్యాగ్‌ ను మాత్రం మాఫీ చేసుకోలేకపోతున్నారు. ఇక ఇటీవల కామికాన్ వేదికపై కూడా.. ప్రభాస్ కాస్త బిడియంగానే కనిపించారు. ఇంటర్నేషనల్ ప్రెస్‌మీట్లో పొడిపొడిగానే మాట్లాడారు. అలా మాట్లాడుతూనే.. విశ్వనాయకుడు కమల్‌కు కాస్త కోపం కూడా తెప్పించారు మన డార్లింగ్. ఎస్ ! కామికాన్‌ ఇంటర్నేషనల్ ఈవెంట్లో.. కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌, హీరో ప్రభాస్‌, కమల్ హాసన్‌ ఓ హాలీవుడ్ మీడియాతో స్పెషల్ గా ఇంటర్య్యూ ఇస్తున్ క్రమంలోనే.. ప్రభాస్‌ కాస్త పొడిపొడిగా మాట్లాడుతూ.. మైక్‌ ను తన నోటికి దగ్గరగా పట్టుకోవడం మరిచిపోయారు. ఇక ఇది చూసిన కమల్ హాసన్ కాస్త సీరియస్‌గా… ప్రభాస్‌కు సైగ చేశారు. మైకు నోటి దగ్గర పెట్టుకో అంటూ.. ప్రభాస్‌ మైకును పట్టుకోబోయారు. దీంతో ప్రభాస్‌ షాకై.. కమల్‌ హాసన్‌కు సారీ చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మళ్లీ ఇద్దరి మధ్య మొదలైన యుద్ధం..

శంకర్ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ సీరియస్ !! ఎందుకంటే ??


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.