Most Recent

Avinash: అవినాష్‌ భార్య బేబీ షవర్‌ ఫంక్షన్‌లో బిగ్‌బాస్‌ సొహైల్‌.. తనకూ సీమంతం జరపాలంటూ రచ్చ.. వైరల్‌ వీడియో

Avinash: అవినాష్‌ భార్య బేబీ షవర్‌ ఫంక్షన్‌లో బిగ్‌బాస్‌ సొహైల్‌.. తనకూ సీమంతం జరపాలంటూ రచ్చ.. వైరల్‌ వీడియో

ప్రముఖ కమెడియన్‌, జబర్దస్త్ ఫేమ్‌ అవినాష్‌ త్వరలోనే తండ్రిగా ప్రమోషన్‌ పొందనున్నాడు. అతని భార్య అనూజ త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అనూజ సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. కాగా ఈ ఫంక్షన్‌లో బిగ్‌బాస్‌ ఫేమ్ సొహైల్‌ సందడి చేశాడు. ఇటీవలే మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ సినిమాలో హీరోగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. ఈ నేపథ్యంలో తన సినిమాను ప్రమోట్‌ చేసుకునేందుకు సరికొత్త పంథాను అనుసరించాడు. ఇందులో భాగంగా ముక్కు అవినాష్‌ భార్య సీమంతం వేడుకకు హాజరైన సొహైల్‌ .. తానూ గర్భంతో ఉన్నానని, తనకూ సీమంతం జరపాలని ముక్కు అవినాష్‌ కు చెప్పాడు. అతని మాటలకు మొదట ఆశ్చర్యపోయాడు అవినాష్‌. అయితే సొహైల్‌ పట్టు విడవకుండా అడిగాడు. దీంతో ‘మగవాళ్లకు గర్భం రావడం ఏంటి?’ అని తిడుతూనే అవినాశ్‌ సొహైల్‌ను కూర్చోబెట్టి పట్టు బట్టలు అందించాడు. ఆ తర్వాత నెత్తిన అక్షింతలు వేసి ఆశీర్వదించాడు. ఈ సందర్భంగా తన మాట కాదనకుండా తనకు శ్రీమంతం జరిపించిన జబర్దస్త్ అవినాష్ కి సయ్యద్ ధన్యవాదాలు తెలిపాడు. కాగా ఆఖరులో ‘ఆగస్టు 18 డెలివరీ డేట్‌.. మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ థియేటర్లలో చూడండి’ అని సొహైల్‌ చెప్పడంతో ఇదంతా మూవీ ప్రమోషన్లలో భాగంగానే జరిగిందని అర్థమైంది.

ముక్కు అవినాష్‌ భార్య సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా బిగ్‌బాస్‌ సొహైల్‌కు సంబంధించిన వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా తనదైన కామెడీ పంచులు, ప్రాసలతో బుల్లితెరపై స్టార్‌ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు అవినాష్‌. జబర్దస్త్‌ లో టీమ్‌ లీడర్‌గా కూడా పనిచేశాడు. ఆ తర్వాత ప్రముఖ టీవీ రియాలిటీ షో బిగ్‌బాస్‌లోనూ సందడి చేశాడు. ప్రస్తుతం వెండితెరపైనా మెరుస్తున్నాడీ ట్యాలెంటెడ్‌ కమెడియన్‌. ఇక అవినాష్‌, అనూజల వివాహం 2021 అక్టోబర్‌లో జరిగింది. తమ వైవాహిక దాంపత్య బంధానికి గుర్తింపుగా త్వరలోనే ఓ పండంటి బిడ్డ వీరి జీవితంలోకి రానుంది. ఇక శుక్రవారం (ఆగస్టు 18) రిలీజైన మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. ఇందులో రూపా కొడవాయుర్ ,సుహాసిని మణిరత్నం, వైవా హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ముక్కు అవినాష్ భార్య సీమంతం వేడుకలు

 

View this post on Instagram

 

A post shared by Mukku Avinash (@jabardasth_avinash)

 

 

View this post on Instagram

 

A post shared by Mukku Avinash (@jabardasth_avinash)

 

View this post on Instagram

 

A post shared by anujaavinash (@avii_anuu)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.