
ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్, హర్రర్, థ్రిల్లర్ సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది.అందుకు తగ్గట్లే పలు ఓటీటీ సంస్థలు ఈ జోనర్ సినిమాలను భారీగా రిలీజ్ చేస్తుంటాయి. వేరే భాషల్లో విడుదలైన సినిమాలను కూడా తెలుగు డబ్బింగ్ చేసి మరీ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు తెస్తుంటాయి. అలా తాజాగా మరో హార్రర్ థ్రిల్లర్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. హార్రర్ జోనర్ సినిమాలు చూసే వారికి ‘1920’ సిరీస్ సినిమాల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2008లో ‘1920’ పేరుతో మొదటి పార్ట్ రాగా, 2018లో ‘1921’ పేరుతో నాలుగు సినిమా వచ్చింది. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సూపర్‌హిట్‌గా నిలిచాయి. తాజాగా ‘1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్’ పేరుతో ఈ సిరీస్‌లో ఐదో భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన అవికాగోర్ ఈ మూవీలో కీ రోల్ పోషించడం విశేషం. రాహుల్ దేవ్, బర్ఖా బిష్ట్, అమిత్ బెల్, అవతార్ గిల్ తదితరులు నటించారు. జూన్ 23న హిందీతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లో 1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్ రిలీజై యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. హార్రర్ థ్రిల్లర్ సినిమాలను చూసేవారికి బాగానే ఆకట్టుకుంది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ‘1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్’ ఇప్పుడు సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. శనివారం (ఆగస్టు 20) అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో 1920 సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
‘1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్’ సినిమా హిందీతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమాకు బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మహేశ్ భట్ రచనా సహకారం అందించారు. కృష్ణా భట్ దర్శకత్వం వహించారు. విక్రమ్ భట్ ప్రొడక్షన్, హౌస్ ఫుల్ మోషన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల బ్యానర్లపై విక్రమ్ భట్, డాక్టర్ రాజ్ కిషోర్ ఖవారే, రాకేష్ జునేజా, శ్వేతాంబరి భట్ఈ మూవీని నిర్మించారు. తెలుగులో లక్ష్మీ గణఫతి ఫిలింస్ సంస్థ ఈ మూవీని రిలీజ్ చేసింది. పునీత్ దీక్షిత్ స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో ‘1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్’ సినిమాను మిస్ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
‘1920 హార్రర్స్ ఆఫ్ ది హార్ట్’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Kya badle ki aag maut ke baad bhi zinda rehti hai?
Vikram Bhatt’s ‘1920: Horrors of the Heart’ now streaming
#1920 #HorrorsOfTheHeart #1920OnHotstar pic.twitter.com/6hVaP3UGmW
— Disney+ Hotstar (@DisneyPlusHS) August 18, 2023
అవికా గోర్ లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టులివే..
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.