Most Recent

Vivek Oberoi: వివేక్ ఒబెరాయ్‏కు రూ.1.55 కోట్ల టోకరా.. ఆ ముగ్గురిని నమ్మి మోసపోయిన నటుడు..

Vivek Oberoi: వివేక్ ఒబెరాయ్‏కు రూ.1.55 కోట్ల టోకరా.. ఆ ముగ్గురిని నమ్మి మోసపోయిన నటుడు..

బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ రూ.1.55 కోట్లు పొగొట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులు ఒక ఈవెంట్.. సినీ నిర్మాణ సంస్థలో పెట్టుబడులు పెట్టమని చెప్పి.. తనను పూర్తిగా నమ్మించి మోసం చేశారని వాపోయారు వివేక్. నిర్మాణ సంస్థలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయంటూ ఓ సినీ నిర్మాతతోపాటు.. ఇద్దరు వ్యాపార భాగస్వాములు తనను నమ్మించారని.. రూ.1.55 కోట్లు పెట్టుబడి పెట్టగా.. ఆ డబ్బును ముగ్గురు వ్యక్తులు తమ సొంతానికి వాడుకున్నారని అన్నారు. ఆ మోసం పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. సదరు ఈవెంట్, సినీ నిర్మాణ సంస్థలో వివేక్ ఒబెరాయ్ భార్య కూడా భాగస్వామిగా ఉన్నారు. వివేక్ ఒబెరాయ్ చార్డర్ అకౌంటెంట్ ఫిర్యాదుతో 409, 419, 420 సెక్షన్ల కింద ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.

వివేక్ ఒబెరాయ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన కంపెనీ సినిమాతో తెరంగేట్రం చేశారు వివేక్. ఆ తర్వాత తెలుగుతోపాటు.. హిందీలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆర్జీవీ తెరకెక్కించిన రక్త చరిత్ర, రక్త చరిత్ర 2 సినిమాల్లో నటించడంతో వివేక్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.