Most Recent

SS Rajamouli: ప్రభాస్ కల్కి సినిమాపై రాజమౌళి ఆసక్తికర ట్వీట్.. సాధ్యం చేసి చూపించారంటూ..

SS Rajamouli: ప్రభాస్ కల్కి సినిమాపై రాజమౌళి ఆసక్తికర ట్వీట్.. సాధ్యం చేసి చూపించారంటూ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం కల్కి 2898AD. ఇన్నాళ్లు ప్రాజెక్ట్ కె అనే వర్కింగ్ టైటిల్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ ఇటీవల విడుదల చేసింది చిత్రయూనిట్. గత రెండు రోజుల క్రితం అమెరికాలో జరిగిన కామికాన్ కాన్ వేదికపై ఈ సినిమాపై టైటిల్ రివీల్ చేసింది మూవీ టీం. హాలీవుడ్ రేంజ్‏లో విజువల్స్‏తో రిలీజ్ అయిన గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ముఖ్యంగా ఇందులో ప్రభాస్ లుక్స్ చూసి అడియన్స్ ఫిదా కాగా ఈ సినిమా ప్రభాస్ కెరీర్‏లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యే సినిమాగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక కల్కి 2898AD గ్లింప్స్ పై ఇప్పటికే సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించగా.. తాజాగా ఈ వీడియోపై డైరెక్టర్ రాజమౌళి ఆసక్తికర ట్వీట్ చేశారు.

“గ్రేట్ జాబ్ నాగి అండ్ వైజయంతి మూవీస్. భవిష్యత్ పై సినిమాలను రూపొందించడం చాలా కష్టమైన పని.. కానీ మీరు ఆ సాహసం చేసి.. దానిని సాధ్యం చేసి చూపించారు. ఇందులో డార్లింగ్ లుక్ అదిరిపోయింది. ఇక ఈ సినిమా పై ఒకే ఒక్క ప్రశ్న మాత్రమే మిగిలి ఉంది. అదే రిలీజ్ డేట్” అంటూ ట్వీట్ చేశారు జక్కన్న. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతుంది.

డైరెక్టర్ నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలకపాత్రలలో నటిస్తుండగా.. లోకనాయకుడు కమల్ హాసన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణలో పాల్గొన్నారు కమల్. ప్రభాస్, నాగ్ అశ్విన్‏తోపాటు కమల్, అమితాబ్, రానా సైతం అమెరికాలో జరిగిన కామిక్ కాన్ ఈవెంట్లో పాల్గోన్నారు. ఈ వేదికపై ప్రభాస్‏ను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ రానా ప్రాజెక్ట్ కె గ్లింప్స్ రిలీజ్ చేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.