Most Recent

Ustaad Trailer: ఆకట్టుకుంటున్న ‘ఉస్తాద్’ ట్రైలర్.. ఇన్‌స్పైరింగ్ అండ్ థ్రిల్లింగ్ స్టోరీతో రాబోతున్న శ్రీసింహ..

Ustaad Trailer: ఆకట్టుకుంటున్న ‘ఉస్తాద్’ ట్రైలర్.. ఇన్‌స్పైరింగ్ అండ్ థ్రిల్లింగ్ స్టోరీతో రాబోతున్న శ్రీసింహ..

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తనయుడు శ్రీసింహ తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ అండ్ యూత్ ఫుల్ కాన్సెప్ట్ మూవీస్ చేస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే పలు కొత్త జానర్లలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యిన ఆయన.. ఇప్పుడు మరో కొత్త కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. శ్రీసింహా ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం ఉస్తాద్. ఇందులో బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను వారాహి చలనచిత్రం, క్రిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రాకేష్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు నిర్మిస్తున్నారు. ఇన్‌స్పైరింగ్ అండ్ థ్రిల్లింగ్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈసినిమాకు ఫణిదీప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. సాధారణ మిడిల్ క్లాస్ అబ్బాయి.. తన కన్న కల కోసం.. అటు ప్రేమ కోసం ఫైట్ చేసే క్రమంలో అతని జీవితంలో ఎదురైన సంఘటనలే ఉస్తాద్. బైక్ డ్రైవింగ్ అంటే ఇష్టమున్న హీరోకు.. విమానం నడపాలనేది ఫ్యాషన్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి విమానం నడిపేందుకు అతని ప్రయాణం.. ప్రేమ,.. ఆ గమ్యంలో తనకు ఎదురయ్యే సన్నివేశాలను ట్రైలర్ లో చూపించారు. మొత్తంగా ట్రైలర్ చూస్తుంటే.. ఇన్‌స్పైరింగ్ అండ్ థ్రిల్లింగ్ స్టోరీతో ఉస్తాద్ రాబోతుందని తెలుస్తోంది.

ఇప్పటికే షూటింగ్ కంప్లీ్ట్ చేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 12న అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి అకీవా సంగీతం అందిస్తున్నారు. అయితే ఈసినిమా కంటే ముందే మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్, రజినీకాంత్ జైలర్ సినిమాలు ఉన్నాయి. మరీ వాటితో పోటీ పడేందుకు ఉస్తాద్ రెడీ అవుతున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.