Most Recent

Ileana D’Cruz: మై లిటిల్.. మరోసారి బేబీ బంప్ ఫోటో షేర్ చేసిన ఇలియానా.. కానీ ఈసారి..

Ileana D’Cruz: మై లిటిల్.. మరోసారి బేబీ బంప్ ఫోటో షేర్ చేసిన ఇలియానా.. కానీ ఈసారి..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో స్టార్ హీరోయిన్‏గా క్రేజ్ సంపాదించుకుంది ఇలియానా. సౌత్ టూ నార్త్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ.. చాలా రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే పెళ్లి కాకుండానే ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసి అభిమానులను షాకిచ్చింది ఈ గోవా బ్యూటీ. దీంతో ఇలియానాకు కంగ్రాట్స్ చెబుతూనే.. మరోవైపు ఆ బిడ్డకు తండ్రి ఎవరు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. ప్రెగ్నెన్సీ అనౌన్స్ తర్వాత ఎప్పటికప్పుడు బేబీ బంప్ ఫోటోస్ షేర్ చేస్తూ తన బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. అయితే ఇప్పటివరకు తన బాయ్ ఫ్రెండ్ లేదా హస్బెండ్ ఫోటోస్ మాత్రం షేర్ చేయలేదు.

అయితే కొన్నిసార్లు ఓ వ్యక్తి ఫోటోస్ షేర్ చేసినప్పటికీ ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇక ఇటీవలే మరో వ్యక్తి ఫోటో షేర్ చేయగా.. అతనే ఇలియానా భర్త కావచ్చు అనే సందేహాలు వ్యక్తం చేశారు నెటిజన్స్. అయితే ఇప్పటికీ ఇలియానా తన భర్త ఎవరనేది రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటెన్ చేస్తోంది.

తాజాగా మరోసారి బేబీ బంప్ ఫోటో షేర్ చేసింది ఈ గోవా బ్యూటీ. ప్రస్తుత పిక్ చూస్తుంటే.. ఇలియా నిండు గర్భిణిగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆమెకు 9వ నెల అని తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో ఇలియా తన బిడ్డను అందరికి పరిచయం చేయబోతుంది. అలాగే.. తన లైఫ్ పార్ట్నర్ ఎవరనేది కూడా తెలియజేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ గోవా బ్యూటీ షేర్ చేసిన బేబీ బంప్ పిక్ నెట్టింట వైరలవుతుండగా.. ఆమెకు జాగ్రత్తలు చెబుతున్నారు ఫ్యాన్స్.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.