Most Recent

TANA: తన సభలక హజరన నటసహ.. బలయయత పట ఇళయరజ కడ..

TANA: తానా సభలకు హాజరైన నటసింహం.. బాలయ్యతో పాటు ఇళయరాజా కూడా..

ఫిలడెల్ఫియాలో తానా సభలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఈ నెల 7 నుంచి 9 వరకు ఈ సభలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పలువురు సినీ సెలబ్రెటీలు హరాజయ్యారు. నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమానికి హాజరయ్యేదుకు అమెరికా వెళ్లారు. బాలయ్యకు ఘన స్వాగతం పలికారు తానా సభ్యులు. తానా సభల అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు,  కాన్ఫరెన్స్ కోఆర్డినేటర్ రవి పొట్లూరి, నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన్ కృష్ణ,  కాన్ఫరెన్స్ అడ్వైజర్ జానీ నిమ్మలపూడి, సతీష్ మేక బాలయ్యకు స్వాగతం పలికారు. న్యూయార్క్ నుంచి భారీ ర్యాలీగా తరలి వెళ్లారు.

బాలకృష్ణ తో పాటు మ్యూజిక్ సెన్సేషన్, మాస్ట్రో ఇళయరాజా కూడా ఈ కార్యక్రమంకు హాజరయ్యారు. ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్ 23వ తానా సమావేశ వేదిక అయ్యింది. ఇక ఈ సదసస్సులో యంగ్ సెన్సేషన్ శ్రీలీల కూడా పాల్గొంటుందని తెలుస్తోంది.

బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధర, మనవడితో కలిసి ఈ శుక్రవారం నుండి జరిగే తానా సభల్లో పాల్గొనేందుకు న్యూజెర్సీ చేరుకున్నారు. జేఎఫ్‌కే విమానాశ్రయంలో ఆయనకు తానా ప్రతినిధులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.