
ప్రస్తుతం మిల్కీ బ్యూటీ తమన్నా హవా నడుస్తుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు వెబ్ సిరీస్ లు చేస్తూ సందడి చేస్తుంది. ఇటీవలే బాలీవుడ్ లో రెండు వెబ్ సిరీస్ లు చేసి ఆకట్టుకుంది. బోల్డ్ సీన్స్ లో నటించి రచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ. తమన్నా అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు . ఇక ఇప్పుడు మరో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఒకటి మెగాస్టార్ సినిమా అయితే ఇంకొకటి సూపర్ స్టార్ సినిమా. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో నటిస్తుంది తమన్నా. సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత తమన్నా చిరంజీవితో ఇప్పుడు మరోసారి కలిసి నటిస్తుంది. ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళం మూవీకి రీమేక్. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ సినిమాలోనూ నటిస్తుంది తమ్ము బేబీ. ఇటీవలే ఈ సినిమా నుంచి నువ్ కావాలయ్యా అనే సాంగ్ ను రిలీజ్ చేశారు.
ఈ పాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఇప్పుడు ఈ పాటే వినిపిస్తుంది. జైలర్ సినిమా ఆగస్టు 10న విడుదల కానుండగా.. భోళాశంకర్ ఆగస్టు 11న రిలీజ్ అవుతుంది. అయితే తమన్నా ఓ సినిమాలో చేసిన తన పాత్ర తనకు అస్సలు నచ్చలేదని.. నా యాక్టింగ్ చూస్తే నాకే చిరాకేసిందని కామెంట్స్ చేసి షాక్ ఇచ్చింది.
కెరీర్ బిగినింగ్ లో తమన్నా చాలా సినిమాల్లో నటించింది. తమిళ్ భాషలోనూ పలు సినిమాల్లో చేసింది. అలా నటించిన సినిమాల్లో సుర ఒకటి. దళపతి విజయ్ హీరోగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో తన పాత్ర తనకు నచ్చలేదని తెలిపింది తమన్నా. షూటింగ్ సమయంలోనే ఈ మూవీ పై ఓ అంచనా ఏర్పడిందని.. కానీ కమిట్ అయిన తర్వాత సినిమాను పూర్తి చేయాల్సిన బాధ్యత తమ పై ఉంటుందని తెలిపింది. సినిమా చేయడం వరకే మన చేతిలో ఉంటుంది. జయాపజయాలు ఆడియన్స్ చేతిలో ఉంటుంది అని తెలిపింది తమన్నా.