Most Recent

Sreeleela : మరోసారి మాస్ స్టెప్పులతో అదరగొట్టనున్న శ్రీలీల.. ఏ మూవీలో అంటే

Sreeleela : మరోసారి మాస్ స్టెప్పులతో అదరగొట్టనున్న శ్రీలీల.. ఏ మూవీలో అంటే

లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఎ ముద్దుగుమ్మ ఇక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. పెళ్లి సందడి సినిమాతో పరిచయం అయ్యింది శ్రీలీల. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ వయ్యారి. ఈ ముద్దుగుమ్మ అందం, చలాకీ తనం కుర్రకారును కట్టిపడేశాయి. ఆతర్వాత మాస్ మహారాజ రవితేజ నటించిన ధమాకా సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో అరడజను కు పైగా సినిమాలు ఉన్నాయి. క్రేజీ ఆఫర్స్ కు ఓకే చెప్పి బిజీగా మారిపోయింది. అంతే కాదు డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ కూడా మిస్ చేసుకుందని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో మెయిన్ హీరోయిన్ గా చేస్తుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తుంది.

వీటితోపాటు నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమాలో ఓ మాస్ సాంగ్ ఉండనుందని తెలుస్తోంది. ధమాకా సినిమాలో పల్సర్ బైక్ పాటలో శ్రీలీల తన డాన్స్ తో అదరగొట్టిన విషయం తెలిసిందే.

ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాలో కూడా అదే తరహా సాంగ్ ఉండనుందట. మరోసారి శ్రీలీల తన మాస్ డాన్స్ తో కుమ్మేస్తుందని అంటున్నారు. దీని పై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ కు జోడీగా అందాల చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో బాలయ్య తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. అనిల్ ఈ సినిమాలో కామెడీ తోపాటు యాక్షన్ సీన్స్ కూడా హైలైట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.