Most Recent

Slaar Teaser: వర డజర.. బట నట ఇజరస.. నకటస లవలల సలర టజర.. ఫయనసక పనకల ఇక..

Slaar Teaser: ‘వెరీ డేంజర్.. బట్ నాట్ ఇంజూరస్’.. నెక్ట్స్ లెవల్లో ‘సలార్’ టీజర్.. ఫ్యాన్స్‌కు పూనకాలే ఇక..

ఫ్యాన్స్ నిరీక్షణకు మొత్తానికి తెర పడింది. ఎప్పుడెప్పుడా అంటూ పాన్ ఇండియా మూవీ లవర్స్ పిచ్చిగా ఎదురుచూసిన సలార్ టీజర్ వచ్చేసింది. కేజీఎఫ్ 1,2 చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఇక ఇప్పుడు సలార్ మూవీతో షేక్ చేసేందుకు సిద్ధమయినట్లుగా టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పటివరకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించిన మాస్ అవతారాలకు మించి ఈ సినిమాలో డార్లింగ్ కనిపించనున్నారని తెలుస్తోంది. కాసేపటి క్రితం విడుదలైన టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తుందనే చెప్పుకొవాలి. అంతేకాదు.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ థియేటర్లో విజిల్స్ వేయడం పక్కా అని తెలుస్తోంది. ప్రభాస్ కెరీర్‏లోనే ఈ చిత్రంలోని ఇంటర్వెల్ బ్లాక్ బెస్ట్ అవుతుందని సమాచారం. పూర్తి మాస్ యాక్షన్ మూవీగా రాబోతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది. ఇందులో మలయాళీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ నెలలో అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కోసం భారీగానే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

పాన్ ఇండియా లెవల్లోనే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 14 దేశాల్లో ఈ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే అన్ని దేశాల్లో ఒకేసారి కాకుండా.. ఒక్కో దేశంలో ఒక్కో సమయంలో విడుదల చేశారు. ఇక ఇప్పటికే సోషల్ మీడియాలో #SalaarTheSaga, #SalaarTeaser, #Prabhas హ్యాష్ ట్యాగ్స్ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి.

ఇప్పటికే వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు. దీంతో ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్ చిత్రంపైనే ఉన్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మొదటిసారి ప్రభాస్ నటిస్తోన్న సినిమా కావడంతో సలార్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.