Most Recent

Shah Rukh Khan: అతన అదగడ కద.. నటన రద.. షరఖ ఖన ప సచలన వయఖయల చసన పకసతన నట..

Shah Rukh Khan: ‘అతను అందగాడు కాదు.. నటన రాదు’.. షారుఖ్ ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ నటి..

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‏కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం జవాన్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు షారుఖ్. ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తుండగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. అట్లీ, షారుఖ్ కాంబోలో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో తాజాగా బాద్ షా పై పాకిస్తాన్ నటి మహనూర్ బలోచ్ సంచలన కామెంట్స్ చేసింది. షారుఖ్ అంత అందగాడు ఏం కాదని.. అతడికి నటన కూడా రాదంటూ చెప్పుకొచ్చింది. కానీ అతను పెద్ద బిజినెస్ మెన్ అని.. తనను తాను ఎలా ప్రమోట్ చేసుకోవాలో తనకి బాగా తెలుసనని చెప్పుకొచ్చింది. మహనూర్ బలోచ్ చేసిన కామెంట్స్ పై షారుఖ్ అభిమానులు మండిపడుతున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహనూర్ బలోచ్ మాట్లాడుతూ.. “షారుఖ్ చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. కానీ అంత అందగాడు మాత్రం కాదు. అలాగే అతనికి నటన కూడా రాదు. ఇండస్ట్రీలో అతనికంటే చాలా మంది అందంగా ఉండే అబ్బాయిలు ఉన్నారు. కానీ వారిని ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలియక, తేజస్సు, చలాకీతనం లేక అలాగే ఉండిపోయారు. కానీ షారుఖ్ గొప్ప వ్యాపారవేత్త.. తనను తాను ఎలా ప్రమోట్ చేసుకోవాలనే విషయం అతనికి బాగా తెలుసు. అందుకే అతను సక్సెస్ అయ్యారు” అంటూ చెప్పుకోచ్చింది. ప్రస్తుతం మహనూర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతుండగా.. షారుఖ్ ఫ్యాన్స్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పబ్లిసిటీ కోసమే ఆమె షారుఖ్ పై ఇలా కామెంట్స్ చేస్తుందని విమర్శలు వస్తున్నాయి.

మహనూర్ బలోచ్ అమెరికాలో జన్మించిన కెనడియన్ పాకిస్థానీ నటి. మాజీ మోడల్ అలాగే ఫిల్మ్ డైరెక్టర్.1993లో మార్వి అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి అడుగుపెట్టింది బలోజ్. ఆ తర్వాత 2013లో హాలీవుడ్ లోని టోర్న్ లో మరియమ్ పాత్రను పోషించింది. ఇదిలా ఉంటే షారుఖ్ నటిస్తోన్న జవాన్ చిత్రం సెప్టెంబర్ 7 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.