
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఖుషి, సిటాడెల్ చిత్రీకరణ కంప్లీట్ చేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఇండోనేషియాలోని బాలిలో తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ఇన్ స్టా వేదికగా షేర్ చేస్తూ.. ఎప్పటికప్పుడు తన గురించి ఫాలోవర్లకు అప్డేట్ ఇస్తుంది సామ్. ఈ క్రమంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన వీడియోస్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడు జిమ్లో చాలా కష్టమైన వర్కవుట్స్ చేస్తూ కనిపించే సామ్…ఈసారి బ్యాలెన్స్ టెస్టింగ్ అంటూ షాకింగ్ స్టంట్స్ చేస్తూ కనిపించింది. అందులో ఆమె అత్యంత సాహోసపేతమైన స్టంట్స్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురించి చేస్తోంది. ఈ వీడియోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ మనం ఇలా పార్టీ చేసుకుందాం అంటూ క్యాప్షన్ ఇచ్చింది సామ్. ఇది చూసిన నెజిటన్స్ భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు.
కొన్నాళ్లుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సామ్.. అప్పట్లో ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకున్నారు. ఈ వ్యాధి నుంచి కాస్త కోలుకున్న తర్వాత శాకుంతలం, యశోద చిత్రాలతోపాటు.. ఖుషి, సిటాడెల్ చిత్రీకరణలలో పాల్గొన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం ఈ సమస్య మరింత ఎక్కువైందని.. దీంతో ఆమె విదేశాల్లో చికిత్స తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇందుకోసం ఆమె సినిమాల నుంచి దాదాపు ఏడాది బ్రేక్ తీసుకోనున్నారని సమాచారం. ఇప్పటికే తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ కోసం తీసుకున్న అమౌంట్ సైతం తిరిగి ఇచ్చేసిందని.. త్వరలోనే చికిత్స కోసం అమెరికా వెళ్లనుందట. ఈ సమయంలోనే ఆమె ఇటీవల సద్గురు ఇషా ఫౌండేషన్ను సందర్శించడంతోపాటు.. బాలిలో తన స్నేహితులతో సమయం గడుపుతున్నారు.
Samantha
ఇక ఇదిలా ఉంటే.. సమంత.. విజయ్ దేవరకొండ జంటగా నటించిన ఖుషి చిత్రం త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ లవ్ అండ్ రొమాంటిక్ మూవీపై ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ ఆకట్టుకున్నాయి.
View this post on Instagram
#SamanthaRuthPrabhu shows off how she parties and it’s unlike anything you imagined
#Samantha #pinkvilla pic.twitter.com/5pEebwJhPv
— Pinkvilla (@pinkvilla) July 25, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

