Most Recent

Pawan Kalyan: మా పవన్‌ కల్యాణ్ దైవాంశ సంభూతుడు .. అందరూ ఆయనను గెలిపించాలి: బ్రహ్మానందం

Pawan Kalyan: మా పవన్‌ కల్యాణ్ దైవాంశ సంభూతుడు .. అందరూ ఆయనను గెలిపించాలి: బ్రహ్మానందం

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ హీరోలుగా నటించిన చిత్రం బ్రో. సముద్ర ఖని దర్శకత్వం వహించిన ఈ మూవీలో కేతిక శర్మ, ప్రియాంక వారియర్‌ హీరోయిన్లుగా నటించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న బ్రో శుక్రవారం (జులై 28)న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో బ్రో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా నిర్వహించారు. సినిమా యూనిట్‌తో పాటు టాలీవుడ్‌కు చెందిన సెలబ్రిటీలు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. టాప్‌ కమెడియన్‌ బ్రహ్మానందం, వైష్ణవ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌ తదితరులు బ్రో ఈవెంట్‌లో సందడి చేశారు. కాగా బ్రోలో బ్రహ్మానందం కీ రోల్‌లో కనిపించనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బ్రహ్మానందం పవన్‌ కల్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్‌ తనకు చాలా ఇష్టమైన వ్యక్తి అని, మంచి మనసు ఉన్న వ్యక్తి అని బ్రహ్మీ కామెంట్స్ చేశారు.

‘బ్రో సినిమాలో ది గ్రేట్‌ పవన్‌ కల్యాణ్‌తో ఒక చిన్న పాత్ర చేయడం నా అదృష్టం. మీరందరూ ఇలా చప్పట్లు కొట్డం కాదు.. మీ అందరి ఆశీస్సులు పవర్‌స్టార్ పై  ఉండాలి. చప్పట్లు కొట్టడం కాదు.. ఆయన విజయాలకు అన్ని విధాలా మనం తోడ్పడాలి. పవన్‌ను 20 ఏళ్ల వయస్సు నుంచి చూస్తున్నాను. పత్తికాయ పగిలి.. తెల్లటి పత్తి బయటకు వచ్చినప్పుడు.. ఎంత తెల్లదనం ఉంటుందో.. పవన్‌లో అంతటి అందం ఉంది. మనిషంతా మంచి తనం. కావాలనుకునేవారికి ఇష్టమైన అవతారంలో కనిపించగల దైవాంశ సంభూతుడు పవన్‌. తన గురించి మాట్లాడగలిగే అతి తక్కువ వ్యక్తుల్లో నేను ఒకరిని. బ్రో మూవీ పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చారు బ్రహ్మీ.

మరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి..


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.