Most Recent

Samantha: షార్ట్ హెయిర్‏తో క్యూట్‏గా కనిపిస్తోన్న సామ్.. చిరునవ్వుతో కట్టిపడేస్తోన్న సమంత..

Samantha: షార్ట్ హెయిర్‏తో క్యూట్‏గా కనిపిస్తోన్న సామ్.. చిరునవ్వుతో కట్టిపడేస్తోన్న సమంత..

సమంత.. ప్రస్తుతం విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలే ఖుషి, సిటాడెల్ చిత్రీకరణలు పూర్తిచేసిన ఆమె.. కొద్ది రోజులుగా కోయంబత్తూరులోని సద్గురు ఇషా ఫౌండేషన్‏లో గడుపుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే సామ్ మయోసైటిస్ సమస్యకు చికిత్స తీసుకోవడానికి విదేశాలకు వెళ్లనుంది. దాదాపు సంవత్సరంపాటు సినిమాల నుంచి బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు చిత్రాల కోసం తీసుకున్న రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసిందని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై స్పందించకుండానే.. పరొక్షంగా సినిమాలకు బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలిపింది. అయితే కొద్ది రోజులుగా నెట్టింట సైలెంట్ అయిన సామ్.. తాజా సరికొత్త లుక్‏లో కనిపించి ఆశ్చర్యపరిచింది. హెయిర్ పూర్తిగా కట్ చేసి.. షార్ట్ హెయిర్‏తో క్యూట్‏ లుక్ లో కనిపించింది.

తాజాగా ఆమె తన ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియోలో బీచ్ వద్ద షార్ట్ హెయిర్‏తో చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. అందులో సామ్ ఎంతో క్యూట్ అండ్ ప్రెటీగా కనిపిస్తూ అభిమానులను ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుండగా.. సామ్ ఎంతో అందంగా ఉందని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సామ్ న్యూలుక్ పై హీరోయిన్ హన్సిక స్పందిస్తూ.. సమంత ఎప్పటికీ అందంగా ఉంటుందంటూ కామెంట్ చేసింది. మొత్తానికి తన న్యూలుక్‏తో ఫ్యాన్స్‏ను ఆశ్చర్యపరిచింది సామ్.

ఇక సామ్, విజయ్ దేవరకొండ జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం ఖుషి. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ మాత్రం ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఇందులో విజయ్, సామ్ కెమిస్ట్రీ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.