Most Recent

Ram Charan: రియల్ గేమ్‌ ఛేంజర్‌ ఆయనే.. రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Ram Charan: రియల్ గేమ్‌ ఛేంజర్‌ ఆయనే.. రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ సినిమాలన్నీ ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ గా రిలీజ్ అవ్వనున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో తన రేంజ్ ను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పారు చరణ్. జపాన్ లోనూ చరణ్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. చరణ్ కూడా ఇప్పుడు ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా చివరి దశలో ఉండగానే టాప్ దర్శకుడు శంకర్ తో సినిమాను లైనప్ చేశారు. గేమ్ చెంజర్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో చాలా మంది నటీనటులు ఉన్నారు. అంజలి, శ్రీకాంత్, సునీల్ , ఎస్ జె సూర్య ఇలా చాలా మంది ఈ సినిమాలో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో వైవిధ్యమైన కథతో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శంకర్. ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసిన శంకర్ ఇప్పుడు రామ్ చరణ్ సినిమాను మరో ఇంట్రెస్టింగ్ కథతో రానున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ రెండు పాత్రల్లో కనిపించనున్నారు.

తాజాగా శంకర్ తన సినీ కెరీర్ లో 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈసందర్భంగా రామ్ చరణ్ ఆయనను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది. శంకర్ రియల్ గేమ్ చేంజర్ అని ప్రశంసలు కురిపించారు రామ్ చరణ్. రామ్ చరణ్ సినిమాతో పాటు కమల్ హాసన్ తో కలిసి భారతీయుడు 2 సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు శంకర్. మరి ఈ రెండు సినిమాలు ఎంత పెద్ద హిట్ అవుతాయో చూడాలి.

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.